yavvanam 1

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng


అర్దరాత్రి

తెల్లని వెన్నెల ఎటు చూసినా సముద్రమె కనిపిస్తుంది.
సముద్రం మద్యబాగం అవడం వలన అలలు లేవు ప్రశాంతముగా ఉంది. ఆకాశం లోని నక్షత్రాలు సముద్రపు నీటిలో ప్రతిబింబించడం వలన నక్షత్రాలను నీటి మీద పరిచారా అన్నట్లు ఉంది.
ఆ నక్షత్రాలను చెరుపుకుంటూ ఒక చిన్న పడవ అందులో చేర అనే అందమైన యువతి ప్రయాణం సాగిస్తుంది.
సముద్రపు నీటి మీద ప్రతిబింబింస్తున్న మెరిసే తారలను చూస్తూ ఆమె వాటిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది..

ఆ పడవలో ఆమె తప్ప మరెవరూ లేరు.

ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు
ఒక గొంతు వినిపించింది...

ఒక్కసారిగా చేర ఉలిక్కిపడి చుట్టూ చూసింది.. ఎవ్వరూ కనిపించలేదు.. కనిపించకుండా వినిపిస్తున్న ఆ గొంతు చేరతో ఇలా చెప్పింది..

"నీకోసం ఆమె వస్తుంది.. ఏళ్ల తరబడి నీ మనసులో ఉన్న దిగులును తొలగించడానికి, బ్రద్దలయ్యే నీ హృదయాన్ని తన చేతులలోకి తీసుకోవడానికి" అని

ఆ గొంతు అలా చెప్తూ ఉంటే చేర ఆశ్చర్యంగా భయం భయంగా దిక్కులు వెతుకుతుంది..

ఆ గొంతు చెప్పడం ముగిసేలోగా ఓ దేవకన్య లాంటి అమ్మాయి వచ్చి చేర ఎదురుగా నిలిచింది..

తన ఎదురుగా ఉంది కలా నిజమా అని అనుకునే లోగా వచ్చిన ఆ దేవకన్యలాంటి అమ్మాయి తన చెయిని అమాంతంగా చేర గుండెల్లోకి దింపి చేర హృదయాన్ని లాగేసుకుంది.

అప్పుడు ఆ దేవకన్య లాంటి అమ్మాయి చేరాతో ఇలా చెప్పింది.. మృదువైన స్వరంతో

" నీ హృదయాన్ని నాకిచ్చావు.. బదులుగా నేను నీకు ఒకటి ఇస్తా ఏం కావాలి" అని అడిగింది.

చేరా అమాయకంగా.. సముద్రపు అడుగున మెరుస్తూ కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తూ "నాకు ఆ నక్షత్రాలు కావాలి" అని అడిగింది..

ఆ దేవకన్య లాంటి అమ్మాయి చేర అమాయకత్వానికి చిన్నగా నవ్వుకుని..
అవి నిజమైన నక్షత్రాలు కావు.. అవి ఆకాశంలో ఉండె నక్షత్రాల ప్రతి బింబాలని చెప్పింది... నీకు కావాలంటే ఆకాశంలోని నిజమైన నక్షత్రాన్ని ఇస్తా అని చెప్పి. ఆకాశంలో మెరిసే ఒక నక్షత్రాన్ని తీసి ఆమె చేరాకు ఇచింది..

🌟🌟🌟🌟🌟

రామ్ 16 ఏళ్ల కుర్రాడు. కోట్ల ఆస్తులున్నా జీవితంలో ఏదో వెలితిగానే ఫీల్ అవుతుంటాడు.ఆ వెలితిని భర్తీ చేసుకోవాలని ఆరాట పడుతుంటాడు

జీవితానికి అర్దం అంటే అది ఖాలీగా ఉండటం కాదని
దాని నిండా అనేక విషయాలు నిండి ఉండాలని అనుకునే వాడు.

అందుకు తన ఆలోచనా పరిదిని పెంచుకోవాలనుకున్నాడు.
ఆ క్షణం నుండి ఎన్నో పుస్తకాలను తిరగేశాడు, ఎందరో మెదావులని, యోగుల్ని, సిద్దులను కలిసాడు.

అలా ఆరేళ్లు గడిచాయి

నిజానికి తన వయసుకన్న ఎక్కువ విషయాలనే తను తెలుసుకున్నాడు. కాని అవేవి తనకి తృప్తినివ్వలేదు.

రెండేళ్ల క్రితం తన దృష్టికి వచ్చిన ఒక విషయం ఈ రెండేళ్ల నుండి రాత్రింబవల్లు తన బుర్రను తొలిచి వేస్తుంది. అది తప్ప తన బుర్రలో మరొ ఆలోచనే తిరగడం లేదు.

టైం రాత్రి రెండవుతుంది

రామ్ మేడ మీద ఒంటరిగా పడుకుని ఉన్నాడు ఐనా రామ్ కి నిద్రపట్టడంలేదు..
మేడ మీద పడుకుని ఆకాశంవైపు చూస్తూ మేఘాలని ఆ పైన ఉండె తారలని చూస్తూ అనుకున్నాడు ఆ పైన స్వర్గం ఉంటుంది అక్కడ అందమైన దేవ కన్యలు ఉంటారు అని.

అలా చూస్తూ ఉండగా అప్పటి వరకు తన కళ్లముందు ఉన్న ఆకాశంలో మెరిసే నక్షత్రాలలో నుండి ఒక నక్షత్రం అమాంథమ్ మాయమైపోయింది..

ఆ నక్షత్రం ఎలా మాయమయింది. దాన్ని ఎవరైనా కాజెసి ఉంటారా లేక అదే ఎక్కడికైనా వెళ్లిపోయిందా అని ఆలోచిస్తుండ గా రాంకి ఒక ఆలోచన తట్టింది.

ఏడాది క్రితం తను ఒక వ్యక్తిని కలిసాడు. అక్కడే తన బుర్రని తొలిఛే పురుగుకి కూడా మందు దొరుకుతుందనుకున్నాడు. ఆలోచన తట్టినదె తడవుగా మేడ దిగి తన గదిలోకి వెళ్లాడు.

అప్పటికే సమయం తెల్లవారుజామున నాలుగు అవుతుంది. చేతికి అందిన బట్టలు బ్యాగ్ లొ కుక్కాడు స్నానం చేసి వచ్చి సర్దిన బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు.

సుమారు రెండు గంటలపాటు ప్రయాణం చెసిన తరువాత జమ్మూలో విమానం దిగాడు.

అక్కడినుండి అద్దె కారులో ఒక పూట ప్రయాణం చేసి హిమాలయాలలోని మంచు పర్వతాల మద్య ఉన్న కార్గిల్ వరకు వెళ్లాడు. కారులో బాగా నిద్రపోవడం వలన వళ్ళంతా అదోమాదిరిగా ఉంది. అక్కడి నుండి గుర్రపు బండి మీద సాయంత్రానికి లూక అనే ఒక ప్రాంతాన్ని చేరుకున్నాడు.

లూక అనేది టూరిస్టులకోసం ఏర్పాటు చేయబడ్డ ఒక చిన్న తాత్కాలిక గ్రామం.

ఎటు చూసినా దట్టమైన మంచుతో కప్ప బడిన పర్వతాలు, గడ్డ కట్టించే చలి.ఆ రాత్రికి అక్కడే ఒక హొటల్లో స్టే చేసాడు.

అసలు తను అక్కడికి ఎందుకు వచ్చాడో , ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో అన్ని ఒకసారి గుర్తుకు తెచుకున్నడు.
మరునాడు ఉదయాన్నె తన ప్రయాణం మొదలు పెట్టాలి కాలి నడకన గడ్డ కట్టించే మంచులొ, ఎత్తైన పర్వతాన్ని ఎక్కాలి అందుకు తగ్గ ఏర్పాట్లు రెడీ చేసుకుని కాస్త కునుకు తీసీ మరునాడు ఉదయాన్నే కొండను ఎక్కడం మొదలు పెట్టాడు. అష్ట కష్టాలు పడి సాయంత్రానికి కొండ పై భాగానికి చేరుకునాడు.

ఆ కొండ చాలా ఎత్తు పెరిగి ఉంది.. ఎంత ఎత్తంటే ఆకాశంలోని మెగాలను చీల్చుకుంటూ పైకి వెల్లి మేగాలకన్నా ఎత్తుగా ఉంది.

ఎంతో కష్టపడి సాయంత్రానికి అక్కడికి చేరుకున్న రాంకి ఆ కొండ పైన ఒక పెద్ద ఆశ్రమం కనిపించింది..

వేల ఏళ్ల నాటి ఆశ్రమం అది.. భూ వాతావరణానికి దూరంగా ఉండటం వలన మరియు మేగాలకన్నా పైన ఉండటం వలన అక్కడి వాతావరణం అంతా కొత్తగా ఉంది.

ఆ ఆశ్రమం లో ముగ్గురే వ్యక్తులు ఉంటారు గురువుగారు అతనికి ఒక శిష్యుడు అతని పేరు వాం మరియు ఒక స్త్రీ.

అక్కడికి వెళ్లగానే ద్వార పాలకుడు అడ్డు చెప్పకుండా లోపలికి రాణించాడు.

ఇంతలో కాషాయం దరించి బోడిగుండు కలిగిన
ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నా పేరు వాం అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుని.. రాంని లోనికి తీసుకెల్లి ఆశ్రమంలోని విడిది గది చూపించి ఈ గదిలో ఉండు, మరునాడు ఉదయాన్నే నువ్వు గురువు గారిని కలవ వచ్చు అనిచెప్పి వెళ్ళబోతూ ఆగి, నువ్వు తినడానికి ఏమైనా పంపిస్తా అని చెప్పి వెళ్లిపోయాడు.

అతను వెల్లి పోయాక... ఎంతో క్రింది నుండి మెట్లు కొండలు గుట్టలు ఎక్కి రావడం వలన వళ్లు పులిసి పొయింది రాం కి. దాంతో కాస్తంత విశ్రాంతి తీసుకుందామని గది కిటికీ తెరిచాడు.

కనుచూపు వెళ్ళినంత వరకు మెగాలు తప్ప మరేమీ కనపడటంలేదు. ఆ మేగాలను చూసి టక్కున తన మొబైల్లో టైం చూసుకుని ఆశ్చర్య పోయాడు. అప్పుడు టైం సాయంత్రం తొమ్మిదవుతుంది కాని ఇంకా ఆ మెగాల మీద సూర్య కాంతి అలాగే వుంది.

అక్కడ చలి లేదు, పైగా రాత్రి తొమ్మిది గంటలకి వెలుతురు చూసి నిజంగా అది స్వర్గమేమో అన్నట్లు ఉంది.

అలా కిటికీగుండా చూస్తూ ఉండిపోయాడు రాం చాలా సేపు..
ఇంతలో ఆ గదిలో ఏదో అలికిడి అవ్వడంతో కిటికి మూసి టక్కున వెనక్కి తిరిగి చూసాడు రాం. అక్కడ కొన్ని ఉడికించిన దుంపలు, లేత చెట్టు బెరల్లు, కొన్ని రకాల పచ్చళ్లు మరియు కొన్ని రొట్టెలు వున్నాయి. అవన్నీ తెచ్చిన వాం వాటిని చూపిస్తూ మీకోసమె అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ వ్యక్తి వెళ్లిపోయాక వాటినన్నింటినీ ఆ కిటికీ గుండా బయట పడేసి తనతో తెచ్చుకున్న కొన్ని బిస్కెట్స్ బ్రెడ్ జాం తినేసి హాయిగా నిద్ర పోయాడు రాం.

ఉదయాన్నే తలుపు తట్టిన శబ్దం విని నిద్ర లేచి తలుపు తీసి ఎవరా అని చూస్తే మరలా అతనే రాత్రి తినడానికి దుంపలు తెచ్చిన వ్యక్తి.

గురువుగారిని కలవడానికి సిద్దంగా ఉండండి అని చెప్పి వాం వెళ్లిపోయాడు. రాం టైం చూసుకున్నాడు ఉదయం 3 అవుతుంది. కిటికి తెరిచి చూసాడు అప్పుడే తెల్లవారుతుంది
త్వర త్వరగా రెడీ అయి తను ఉన్న విడిది గృహం నుండి బయటికి వచ్చాడు రాం.. సూర్యోదయం కాలేదు కానీ చీకటిగా లేదు.. బాగా చలిగా ఉంది వళ్ళంతా శ్వెటర్తో కప్పుకుని మెల్లగా వణుకుతూ అల్లంత దూరంలో కనిపిస్తున్న మండపం దగ్గరకు వెళ్లాడు.

అక్కడ ఎవరూ లేరు అంతా నిశబ్దం.. చుట్టూ చూసాడు ఎవరూ కనపడలేదు. మెల్లగా ఆ పక్కనే ఉన్న ఒక గుడి ఆవరనంలోకి వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి ఎండిన ఆకులతో నిండిన గుడి ముందు భాగం శుభ్రం చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్య పోయాడు రాం. గుడిని శుభ్రం చేస్తున్న ఆ వ్యక్తి పనివాడిలా కాక మహా యోగిలా ఉన్నాడు

రాం ఎవరిని కలవడానికి అక్కడికి వచ్చాడో అతనే గుడిని శుభ్రం చేస్తూ కనిపించాడు.. వెంటనే రాం అతని దగ్గరకు వెల్లి చేతులు జోడిస్తూ గురువుగారికి నమస్కారాలు అని వినయంగా చెప్పాడు.. కాని గురువుగారు మాత్రం ఆయనపాటికి ఆయన చెత్తను శుభ్రం చేసుకునేపనిలో నిమఙమై ఉన్నాడు.. రాం వైపు తిరిగికూడా చూడలేదు

మరలా రామే కల్పించుకుని అయ్యా నేనూ ఏడాది క్రితం ద్యాన మార్గంలో మీ వద్దకు వచ్చాను. మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్పాడు రాం..

నాకు మరొక సందేహం కలిగింది అది తెలుసుకోవడానికే వచ్చా అని చెప్పాడు రాం..

అయినా గురువుగారు ఏమీ మాట్లాడలేదు.

రాం తన సందేహాన్ని వివరించ సాగాడు గురువుగారికి..

నేను రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని కలిసా. అతను పురావస్తు శాఖలో పని చేస్తుంటాడు. ఆ వ్యక్తి దాదాపు రెండు వేల సంవత్సరాలు పైబడిన ఒక గుడిని కనుగొన్నాడు. అదికూడా హిందూ మహాసముద్రపు అడుగు భాగంలో.

అతను నాతో ఇలా చెప్పాడు

ఆ గుడి అక్కడ నిర్మించబడింది కాదని, ఆ గుడిని ఎవరో ఎక్కడనుండొ తెచ్చి అక్కడ వదిలి వెల్లిఉంటారని చెప్పాడు.

ఆ క్రమంలో అతను ఆ గుడిని పరిశీలిస్తుండగా గుడిలో అతనికి ఒక గ్రందం దొరికిందనీ. అది రాగి పలకల మీద చెక్కబడి ఉందనీ.
అంతే కాదు ఆ గ్రందంతోపాటు అతను ఒక ఎత్తైన శిల్పాన్ని కూడా చూసానని చెప్పుకొచ్చాడు..

నేను అతనికి అదిక మొత్తంలో డబ్బిచ్చి ఆ గ్రందం యొక్క నకలుని తెచ్చుకున్నాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా అందులో ఉన్న లిపిని అర్దంచేసుకోలేక పోయాను.

అదే విధంగా అతను చూసిన ఆ శిల్పాన్ని గురించి కూడా నేను కొన్ని విషయాలు అతన్ని అడిగాను..
నేను ఆ శిల్పం గురించి ఎన్ని ప్రశ్నలడిగినా అతను చెప్పిన ఒకె ఒక మాట..

నేను ఆ శిల్పాన్ని చూసి కొన్ని నిమిషాలపాటు శిలలా అయిపోయాను. అంతటి అందాన్ని నేను మునుపెన్నడూ చూడలేదు. బహుశా రాయితో కాకుండా జీవం పోసి చెక్కారేమో ఆ శిల్పాన్ని . ఒకవేల ఆసిల్పాన్ని గాని సముద్రం అడుగుభాగం నుండి భూమ్మీదకు తీసుకువస్తే గొప్ప ప్రపంచ వింత అవుతుంది.. ప్రపంచ దేశాలనుండి కోట్లాది జనం ఆ శిల్పాన్ని చూడ్డానికి వస్తారు. ఒక్కసారి ఆ అందాని చూస్తే మరిచిపోవడానికి ఒక జీవితకాలం పడుతుందని మైకంలో ఉన్నవాడిలా చెప్పాడు.

అతని మాటలు విన్న నేనే ఆశ్చర్యపోయా.. అన్నాడు రాం గురువుగారితో..

గురువుగారు చెత్తను ఊడవడం పూర్తిచేసి రాం వైపు చూసి..
నిజంగా అంతటి అందం భూమ్మీద ఉండదు అతను నీకు అబద్దం చెప్పి ఉండవచు అని గురువుగారు చూచాయగా చెప్పారు రాంతో..

అయినా మనసాపుకోలేక గురువుగారు రాంని అడిగారు.

"ఆ శిల్పం ఎలా ఉంటుందట అని"

దానికి రాం కొంచెం ఆలోచించి.. నాకు నా ఆర్కియాలజీ స్నేహితుడు చెప్పినదాన్ని బట్టి చూస్తే అ శిల్పం బహుశా ఇలా ఉండొచ్చు అని జేబులోనుండి సెల్ఫోన్ బయటికి తీసి అందులో ఒక చిత్ర పటాన్ని గురువుగారికి చూపించాడు.

గురువు గారు ఆ చిట్రపటాన్ని చూసి ఇది నీకు ఎక్కడిది అని అడిగాడు..
మా ఇంటి గోడమీద వేలాడుతూ ఉంటుంది నేను నా మొబైల్తో ఫొటో తీసుకున్నా అని చెప్పాడు రాం.. కానీ నా స్నేహితుడు చెప్పిన శిల్పం ఇది కాదు.. అతను చెప్పినదాన్నిబట్టి చూస్తె ఆ శిల్పం ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్న అని చెప్పాడు రాం

ఆ పోటొ చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు
నీకు ఈ ఫొటొ ఎక్కడిది అని మరలా అడిగారు.
రాంకి ఏమీ అర్దం కాలెదు.
అంత అందమైన శిల్పాన్ని గురించి చెప్తూంటే దాన్ని వదిలేసి మా ఇంటి గోడ మీద వేలాడే ఈ ఫొటొ గురించి అడుగుతున్నారేంటీ ఈయన అనుకున్నాడు రాం.. ఏమో కనుక్కుంటే పోలా అని మరలా మొబైల్ తెరిచి చూపిస్తూ
ఈ పెయింటింగ్ కి ఏమైనా ప్రత్యేకత ఉందా గురువుగారు అని అడిగాడు రాం.
అవును రాం.. ఉంది చాలా ప్రత్యేకత ఉంది ఈ పెయింటింగ్ కి అన్నాడు గురువుగారు..

కొంచెం ఆ ప్రత్యేకత ఎంటో చెప్తారా ఈ పెయింటింగ్ గురించి అని రాం గురువుగారిని అడిగాడు..
గురువుగారు అలా వెల్లి పక్కనే ఉన్న ఒక అరుగుమీద కుర్చునాడు చేతిలో ఉన్న చీపురు కట్ట పక్కనపెట్టి..

పూర్తిగా తెల్లవారింది వెచ్చని సూర్యకిరణాలు భూమిమీద పడుతున్నాయి.. పొగమంచు మెల్లగా కనుమరుగవుతుంది..

రాం తన వంటిమీద ఉన్న శ్వెటర్ తీసేసి వెల్లి గురువుగారి ఎదురుగా నిలబడ్డాడు..

అప్పుడు గురువుగారు రాం మిబైల్ లోని ఆ పెయింటింగ్ గురించి చెప్పడం ప్రారంభించాడు..

కొంత కాలం క్రితం నన్ను ఒక ధనవంతుడు కలిసాడు.. అతను తెల్ల పేపర్ మీద ఊహించి గీయించుకున్న ఒక నలుపు తెలుపు రంగులతో ఉన్న పెయింటింగ్ ని చూపించి.. ఇది నకిలీ చిత్రపటం కానీ ఇలాంటి అసలైన పెయింటింగ్ ఒకటి ఉంది. ఎక్కడుందో ఎవరిదగ్గర ఉందో నాకు తెలియదు. కాని ఆ పెయింటింగ్ ని కలిగి ఉన్నవాడు ఏదో ఒకరోజు కచ్చితంగా మిమ్మల్ని కలుస్తాడు వాడు తెలివైన వాడయుంటె.. అందుకే మీ దగ్గరకు వచ్చా అని చెప్పాడు గురువుగారు.

దాని ఖరీదు వేల కోట్లలో ఉంటుందని చెప్పాడు.
అప్పుడే నేను ఈ పేయింటింగ్ గురిచి విన్నాను అన్నాడు గురువుగారు..

ఇంతకీ ఆ పెయింటింగ్ గొప్పతనం ఎంటో అని రాం గురువుగారిని అడిగాడు.

సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం యూరోప్ లొ మిలాన్ అనే దేశంలో ఒక కుర్రాడు ఉండేవాడు. అతను చిన్నప్పటినుండి ఏ పనీ పాట లేకుండా ఉండేవాడు కాని చాలా తెలివైనవాడు. ఎన్నో వస్తువులు, అదునాతన యుద్ద పరికరాలు మరియు ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాల ఊహా చిత్రాలను తయారు చేసాడు. ఒకరోజు ఆ కుర్రాడు తన ప్రతిభను మిలాన్ రాజుకి చూపించాడు. రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు కుర్రాడి ప్రతిభకి. వెంటనె ఆ కుర్రాన్ని సైణ్యంలొ పెట్టుకుని గొప్ప ఇంజనీర్ పదవిని ఇచ్చాడు.

సైన్యంలో పని చేస్తూ ఆ కుర్రాడు ఖాలీ సమయంలో పెయింటింగ్స్ గీస్తూ ఉండేవాడు..అలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజు ఆ కుర్రాడు ఒక గొప్ప పెయుంటింగ్ ని వేశాడు.

ఆ పెయింటింగ్ లో ఒక పొడవాటి టేబుల్ పక్కన ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు భోజనం చెయడానికి సిద్దంగా. ఆయనకి కుడివైపున మరియు ఎడమ వైపున మరికొందరు కూర్చుని ఉంటారు. వారు కూడా భోజనం చెయడానికె అన్నట్టుగా. వారందరికీ మద్యలో ఉన్న వ్యక్తి గురువు లాగ పక్కన ఉన్న వారు శిష్యులు లాగ ఉంటారు ఆ పెయింటింగ్ లొ. కాని ఆయన అప్పుడు గొప్ప చిత్రకారుడు కానందున ఆ పెయింటింగ్ ని ఎవరూ పట్టించుకోలేదు.ఆ తరువాత కొన్నేళ్లకీ ఒక స్త్రీ చిత్ర పటాన్ని ఆయన గీశారు. అదికూడ ఎంతో గొప్పగా ఉంటుంది. కాని ఈ రెండు పెయింటింగ్స్ చేయడానికి మద్యలో కనీసం ఆరు నుండి పది సంవత్సరాల సమయం ఉంది. అది టర్కీ యుద్ద సమయం. ఆ సమయంలో ఆయన మరో పెయింటింగ్ చెసారు. కాని ఆయన అంత గొప్ప చిత్రకారుడు కాంనందున అప్పట్లొ ఆయన పెయింటింగ్స్ కి అంత ప్రాచుర్యం లేదు. అందుచేత వాటిని అక్కడా ఇక్కడా అంటూ గాలికి వదిలేసాడు. అందువలన టర్కీ యుద్ద సమయంలో అంటే మొదటి మరియు మూడవ పెయింటింగ్ కి మద్యలో చేసిన రెండవ పెయింటింగ్ కూడా అలాగే గాలికి వదిలివేయ పడింది. అలా కొన్ని వందల ఏళ్లు గడిచిన తరువాత ఆ పెయింటింగ్స్ కి గొప్ప ఆదరణ లభించింది. ఎంతగా అంటే ప్రపంచంలోనే అవే గొప్ప పెయింటింగ్స్ అని. కాని మూడింటిలొ మొదటిది మూడవది మాత్రమే ఇప్పుడున్న ప్రపంచానికి తెలుసు మద్యలో టర్కీ యుద్ద సమయంలో గీసిన పెయింటింగ్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు దాని ఆచూకీ కోసమే ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అని వివరించాడు గురువుగారు.

ఇప్పుడు నెను ఆ పెయింటింగ్ గురిచి తెలుసుకోవాలని లేదనీ, ఆ గ్రందం లొ ఏముందో తెలుసుకోవాలని వుండని గురువుగారికి చెప్పాడు రాం

మీరు అందులొ ఉన్న విషయాన్ని తెలియచెస్టారని వచ్చాను.

అని తను వచ్చిన విషయం వివరంగా గురువుగారికి చెప్పాడు

అప్పుడు గురువుగారు ఆకులు ఊడవడం పూర్తి చేసి రాం ని ఆ పుస్తకం తాలూకు నకలుని ఇవ్వమని అడిగాడు.

గురువుగారు ఆ పుస్తకం యొక్క నకలు పేజీలను పరిశీలించారు. ఆ గ్రంథం లోని ప్రతి పేజీ ని పూర్తిగా చదివి అర్దం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని. రాత్రికి నీకు అంతా వివరిస్తా అని చెప్పి గురువుగారు అక్కడినుండి వెళ్లిపోయారు.

రాం కూడా తిరిగి తన గదికి వెల్లిపొయాడు.

రాం వెళ్లేసరికి తన గదిలో ఒక అందమైన యువతి ఉంది.

ఆమె రాం బెడ్ పై పడుకుని ఉంది కాని నిద్రపోలేదు.

రాం రావడం గమనించి బెడ్డు మీదనుండి దిగి పక్కగా నిలపడింది.

ఆమె చాలా అందంగా వుంది

రాం ఆమె కళ్లలోకి సూటిగా చూసాడు.

ఆమెకూడా తదేకంగా రాం నే చూస్తూ ఉంది.

ఆమె రాం కోసమే ఎదురుచూస్తూన్నట్టుగా ఉంది.

తన గదిలో ఉన్న ఆ యువతిని చూసి ఎదో అడగాలని రాం అనుకునే లోగా ఆమె తనను తాను పరిచయం చేసుకుంది.

"నా పేరు షాన్ "

నెను ఇ ఆశ్రమంలో గురువుగారికి సేవ చేస్తుంటాను

"ఇప్పుడు మాత్రం మీకు"
అని చెప్పి ఒక్క క్షణం ఆగి

తినడానికి దుంపలు తీసుకుని వచ్చా అని వినయంగా చెప్పింది.

రాం కి అర్దం కానట్టు ఆమె మొహం వైపు చూసాడు.

ఆమె మొహంలో ఏదో కంగారుని రాం గమనించాడు.

ఆమెను ఏదో అడగాలనుకుని ఒక్క క్షణం ఆగి మనసు మార్చుకుని

"దుంపలు తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు"

అని ఎంతో వినయంగా చెప్పాడు.

"పరవాలేదు అది నా భాద్యత"

అని ఆమెకూడా అంతే వినయంగా సమాదానం చెప్పి

ఇక వెల్లొస్తా అని ఆమె వెల్లిపొతుండగా

రామ్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు

"ఇటువంటి అరణ్యాశ్రమంలొ ఒక యువతి,
అదీ మీలాంటి అందమైన యువతి".

"ఇంకా ఆచ్చర్యం ఏంటంటె ఆ యువతి ఇక్కడ ఒక పనిమనిషి".

ఎందుకు ?

అని ప్రస్నించాడు రామ్.

ఆమె మవునంగా అక్కడి నుండి వెళ్లిపోయింది సమాదానం చెప్పకుండా

అనవసరంగా అడిగి ఆమెను బాద పెట్టానా అని మనసులో అనుకుని ఆమె తెచ్చిన దుంపలు రొట్టెలు తినడం మొదలు పెట్టాడు.

అదే సమయంలో గురువుగారు తన మందిరంలొ ఆ పురాతన గ్రంధాన్ని చదవడంలో నిమఙమై ఉన్నారు.

ఆశ్రమం అంతా చీకటిగా కొద్దిపాటి పొగమంచుతో నిండి ఉంది

ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉంది. ఎటువంటు శబ్దం లేదు. గురువుగారి మందిరంలొను మరియు రాం గదిలో మాత్రమే దీపాల వెలుగు కొంచెం ఉంది.

రాం ఒంటరిగా తన గదిలో పడుకుని కిటికీలో గుండా ఆకాశం వైపు చూస్తున్నాడు.

సమయం రాత్రి పది గంటలు కావస్తుంది

ఉన్నట్టుండి రామ్ గది తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది

ఆతృతగా తలుపు తీసాను ఎదురుగా షాన్.

ఆమె పొగ మంచులొ దేవ కన్య లా వెలిగిపోతుంది.

ఆమె శరీరం నుండి వచ్చే సుగంద పరిమళం ఆ కొండంతా వ్యాపించి కొండ మీద వుండే గాలికి మత్తెక్కించ్చి నిద్ర పుచ్చిందేమో.

ఆ పరిమళ గాడతకు నాకు ఉపిరి ఆడనంత పరిస్తితి అయింది. కొద్ది క్షణాల పాటు నా మనసు ఆమె మీద నుండి మరల్చుకొలేక పోయాను. అందుకు కారణం ఆమె వస్త్ర దారాన కూడా అయి వుండొచ్చు. ఆ క్షణంలో ఆమెను చూస్తె సన్యాసికి కూడా సంసారిలా మారాలి అనే కోరిక కదులుతుంది.

కాని అవేవి బయటికి తెలియకుండా ఎదురుగా ఉన్న షాన్ ని చూసి. గురువుగారు నన్ను పిలుచుకుని రమ్మని పంపారా అనిఅడిగాడు ఆమెను.

దానికి ఆమె కాదు అన్నట్టు అడ్డంగా తలూపింది.

మరి మీరు ఎందుకు వచారో ఈ సమయంలో అని ఆమెను అడిగాడు.

అయినా ఆమె ఏ సమాదానం చెప్పలేదు.

రాం కి ఏమీ అర్దం కాలెదు.

ఆమె ఈ సమయంలో తన గదిలో ఉన్నట్టు గురువుగారికి కాని మరెవరికీ గాని తెలిసినా తనను అపార్డం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నాడు.

ఒకవేళ ఆమెను లోనికి రానివ్వకపొతే ఆమె ఎందుకు వచిందో తెలుసుకోవడం కుదరదు.

పైగా ఒక ఆడపిల్ల ఈ సమయంలో తన గది ముందు నిలపడింది ఏమని ఆమెను వెనక్కు పంపాలి.

ఏది ఎమైనా ఆమెను లోనికి ఆహ్వానించాడు రాం

ఇంకా వుంది

[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro