yavvanam 2

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

ఏది ఎమైనా ఆమెను లోనికి అహ్వనించాడు రాం.

ఆమె నేరుగా వెల్లి రాం బెడ్ మీద పడుకుంది. రామ్ కి ఏం చేయలో తోచలేదు. ఆమె మౌనంగా ఉంది. రాం పరిస్తితి అంతకన్నా దారుణంగా ఉంది.

ఆమె అలాగే బెడ్డు మీద పడుకుని ఉంది. ఆతను అదే గదిలో ఒక ప్రక్కగా నిలబడి ఉన్నాడు. ఇద్దరి మద్య చాలాసేపు మౌనం.
ఆమె అతన్నే తదేకంగా చూస్తూ ఉంది.
రామ్ మాత్రం తల దించుకుని ఉన్నాడు

"ఎందుకు వచ్చి పడుకున్నావ్"

అని అడిగితే ఒకవేళ ఆమె చెప్పే సమాదానం అతననుకున్నదే ఆయితే అప్పుడు ఏం చేయాలి.
ఒకవేళ అతను అనుకున్నది కాకపోతే మరి ఎందుకు ఆమె వచ్చినట్టు.

కొన్ని నిమిషాల తరువాత రాం ధైర్యం చేసి సన్న గొంతుతో నిజానికి గట్టిగా మాట్లాడాలన్న గొంతు పెగలడంలేదు.

సన్న గొంతుతో

"నా నా నాతో ఎమైనా మట్లాడాలా" అని అడగాలనుకున్నాడు కాని అడగలేదు.

అప్పుడు తనలో తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు

ఒక వేల నిజంగానే తను నాతో ఎమైనా మాట్లాడాలనివస్తె టక్కున వచ్చిన విషయం చెప్పి వెల్లి పోయేది.

అలా కాక తను వేరే ఉద్దేశం తో వచినట్లైతే అదెందుకు ఆమె అడగడంలెదు.

ఒక వేల ఆడ పిల్ల సిగ్గు విడిచి అడగలేక పోతుందేమో అని మనం కమిట్ అయితె.
ఆ తరువాత తను అందుకోసం రాలేదంటే తరువాత మన పరిస్తితి ఏంటి. అని తనలో తానే పరి పరి విదాలుగా తర్కించుకుని ఏది ఎమైనా ఇక ఆలోచించడానికి ఏమీ లేదని ఆమె పడుకుని ఉన్న మంచం వైపుకి నడిచాడు రామ్.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ గురువుగారు తన గదిలో రాం తెచ్చిన గ్రంధాన్ని క్షున్నంగా పరిశీలించడంలొ నిమఙమై ఉన్నాడు.

అప్పటికే గ్రంద్దాన్ని చాలా వరకు పూర్తి చేసాడు. అలా గ్రంధంని చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు గురువుగారు.

తెల్లవారి నాలుగు కావస్తుంది అలికిడి అయిన శబ్దం అయినట్లు అనిపించి గురువుగారికి మెలుకువ వచ్చింది.

షాన్ గురువు గారికి నమస్కరించి గురువుగారు రాత్రి గ్రందాన్ని పరిశీలిస్తు అలాగే నిద్రపోయరని గమనించి అక్కడున్న గ్రంద్దాన్ని మరికొన్ని పుస్టకాలని అక్కడినుండి తీసీ ఆ గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అప్పటికే ఆమె స్నానాదులు గట్రా కానించి ఉంది
ఈలోగా గురువుగారు కాళ్ల కృత్యములు కానించి పూజకు సిద్దం అవడానికి వెళ్లాడు.

రాం బాగా ఆలస్యంగా నిద్రలెచాడు. కొంచెం భయంగా త్వర త్వరగా రెడీ అయి గురువుగారిని కలవడానికి మందిరం వైపు వెళ్లాడు.

ఆశ్రమం అంతా రంగు రంగు ముగ్గులతో తోరణాలతో అలంకరించి ఉంది.

నిన్న లేనివిదంగా ఈరోజు ఎందుకు ఇలా అలంకరింఛారో.
ఎదైణా విసేషమ్ ఉందేమో అనుకుంటూ గురువుగారి మందిరం వైపు నడిచాడు రాం.

అక్కడ గురువుగారు లేరు షాన్ మాత్రమే ఉంది. దూరం నుండి షాన్ ని చూసిన రాం ఏమీ మాట్లాడకుండా మవునంగా వెనక్కి వెళ్లిపోయాడు తన గదికి.

కొంతసేపటి తరువాత చేతిలో గ్రందంయొక్క నకలుతో గురువుగారు రాం గదికి వచ్చాడు. గురువుగారిని చూడగానే రాం బెడ్ మీద నుండి లేచి నిలుచున్నాడు.

పరవాలేదు కూర్చొ అంటూ గురువుగారు చేత్తో చెప్పాడు

రాం గురువుగారిని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని తనుకూడా ఒక చిన్న స్టూలు మీద కూర్చున్నాడు.

గురువుగారు తన చేతిలో ఉన్న నకలును రాం కి ఇస్తూ ఈ గ్రందం మీద నీకు ఎందుకు అంత ఆశక్తి అని అడిగాడు.

తెలియని విషయాల గురించి తెలుసుకోవడం నాకు అలవాటు. ఈ ప్రపంచంలో నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అందులొ ఇదీ ఒకటి.
అని రాం సమాదానం ఇచ్చాడు.

కేవలం తెలుసుకోవడానికే ఆయితే నువ్వు ఇంత దూరం రావు
ఎందుకంటె ఈ పాటి గ్రందాన్ని చదివి చెప్పడానికి చాలా మంది ఉన్నారు నీకు తెలిసి.
అని గురువుగారు అన్న మాటలకి రాం కంగుతిన్నాడు.

రాం మవునంగా ఉండిపోయాడు.

గురువుగారు తన మందిరానికి వెళ్లిపోయాడు.
గురువు గారు వెళ్లిన కొంత సమయానికి షాన్ రాం గదికి వచ్చింది.
వచ్చీ రాగానే రాం ని గట్టిగా కవుగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది.
ఈ రాత్రికె మనం ఇక్కడి నుండి వెల్లిపొవాలని షాన్ రాం తో చెప్పింది.
అలాగే వెళదాం
అంతే కాదు ని డ్రెస్ కూడా మార్చెయాలి పూర్తిగా కప్పుకొ మొహం కూడా కనిపించనతగా. షాన్ ఏమాత్రం ఎదురు చెప్పలేదు.
అనుకున్న వీదంగా డ్రెస్ వేసుకుని రాత్రికి అంతా సిద్దం చేసుకుంది. రాం కూడా సిద్దంగా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఆశ్రమం వెనుక ద్వారం గుండా అంత పెద్ద కొండను దిగడం మొదలు పెట్టారు.

రాం కొండను ఎక్కడం మొదలుపెట్టిన రోజే ఒక గుర్రపు బండి వాడితో చెప్పాడు. తను మూడు రోజుల తరువాత కొండ వెనుక భాగానికి వస్తా అని ఉదయానికి నువ్వు బండి తీసుకుని కొండ వెనుక భాగానికి వస్తె అక్కడినుండి మనం హొటల్ కీ వెళ్లాలి అని అందుకు నీకు తగినంత డబ్బు ఇస్తా అని ముందుగానే మాట్లాడి పెట్టుకున్నాడు.

అనుకున్నట్లుగానే షాన్ మరియు రాం కొండ దిగేసరికి గుర్రపు బండి వాడు అడవిలో కొండ వెనుక ఎదురుచూస్తున్నాడు.

షాన్ బండి ఎక్కుతూంటె బండి వాడు అదోలా చూడటమ్ రాం గమనించాడు. రాం షాన్ తో ఒక మాట చెప్పాడు ఎవ్వరితోను మాట్లాడ వద్దని. షాన్ అలాగే అన్నట్టు తలూపింది.

ఇద్దరు బండిలో ఎక్కి హొటల్ కి వెళ్లారు.

షాన్ కీ అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. షాన్ కీ ఊహ తెలిసినప్పటి నుండి ఆశ్రమం లోనే ఉంది. మొదటిసారి షాన్ కొండ దిగి క్రిందికి వచ్చింది. అయినప్పటికి షాన్ కీ అన్నీ తెలుసు. గురువు గారు ఆమెకు అన్ని వివరంగా చెప్పి పెంచి పెద్ద చెసారు. ఆమె కొండ క్రింద ఉండె ప్రపంచం గురించి వినడమే కాని చుసింది లేదు.

మొదటి సారి చూస్తుండటం వలన కొంచెం వింతగా ఉంది.

హొటల్ గదిలో రాం షాన్ త్వరగా రెడీ అయి ఎయిర్పోర్ట్ కీ వెల్లి ఆ తరువాత సాయంత్రానికి రాం ఇంటికి వెళ్లారు.

నెను ఈ ముసుగు తియ్యవచ్చా అని షాన్ అడిగింది. హా కాని నువ్వు ఎవరి కాంటా పడకుండా ఉంటే చాలు అని సలహా ఇచ్చాడు

ఇల్లు లంక అంత ఉంది ఇంట్లో ఎవ్వరూ లేరు.

షాన్ ఇల్లంతా తిరిగి చూస్తుంది. ఈలోగా రాం తన గదిలో ఎదో పనిలో బిజీగా ఉన్నాడు. షాన్ ఇల్లంతా చూసి రాం గదికి వచ్చింది.

రాం ఎవేవో పేపర్స్ చూస్తున్నాడు.
షాన్ గదిలోకి రావడం చూసి ఇల్లు బావుందా అని అడిగాడు.

మి ఇల్లు చాలా బావుంది. మా ఆశ్రమం కన్నా మి ఇల్లె బావుంది
అని షాన్ చెప్పింది.

దానికి రాం థాంక్స్ చెప్పి నువ్వు ఇక్కడే వుండొచ్చు సంతోషంగా ఎన్నెల్లైన అని చెప్పాడు.

షాన్ వినయంగా చూస్తూ నెను ఈ ప్రపంచం గురించి విన్నాను నా చిన్నతనం నుంచి. కాని ప్రత్యక్షంగా చూళ్ళేదు. ఇప్పుడు చూస్తున్నాను. నెను ఈ ప్రపంచాన్ని అర్దం చేసుకోవడానికి కొన్ని నెలలు లేదా ఏళ్లు పట్టొచ్చు కాని నెను తెలుసుకుంటాను అని చెప్పి వెల్లి రాం పక్కన కుర్చుని రాం కి థాంక్స్ చెప్పి రాం భుజం మీద తలపెట్టి అలా కల్లు మూసుకుంది.

ఇంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం

షాన్ ని లోపలే ఉండమని రాం వెల్లి తలుపు తీసాడు

రాం ఆర్కియాలజీ ఫ్రెండ్ రాజన్ వచ్చాడు.

వచ్చీ రాగానే ఎక్కడ ఎక్కడ అంటూ ఇల్లంతా పిచ్చి పట్టిన వాడీలా తిరుగుతున్నాడు.
చూపించు ఒక్క క్షణం కూడా నెను ఆగలేను.
పిచ్చి వాన్ని అయిపోయా రాం ఇన్ని రూజులు.
ఎక్కడా ఎక్కడా అని బిగ్గరగా అరిచాడు.

లోపల గడిలో నుండి షాన్ బయటికి వచ్చింది హాల్లోకీ.

రాం రాజన్ ని ఓదారుస్తున్నాడు
రాజన్ పిచ్చి పట్టిన వాడిలా జుట్టు పీక్కుంటూ మెల్లగా తల పైకి ఎత్తి చూసాడు.

ఎదురుగా షాన్

రాజన్ ఆమెను తదేకంగా చూస్తూ కొన్ని క్షణాల తరువాత స్పృహ తప్పి పడిపొయాడు.

షాన్ ని లోపలికి వెల్లమని కొన్ని నీల్లు టెసుకుని రాజన్ మొహం మీద కొట్టి లేపాడు.

లెగుస్తూనే అదే అదే అదే రూపం నేను చూసింది అంటూ ట్రాన్స్ లొ ఉన్నవాడిలా చెప్తున్నాడు.

కొంచెం తేరుకుని ఎక్కడుంది తను ఎక్కడుంది చెప్పు రాం

నెను ఆగలేను ఒక్క క్షణం కూడా ఉండలెను ఈ క్షనమె నెను తనని అనుభవించాలి అంటూ ఎగబడుతున్నాడు.

రాం కి కోపం వచ్చింది

రాజన్ నడుము చుట్టూ చేతులు బిగించి ఫ్లోర్ మీద అమాంతం పడేసి చెల్లున పీకాడు

రే... రాం ఫ్రెండ్ వి అని కూడా చూడను చంపేస్తా

నిన్ను చంపి...ఆ తరువాత దాని సంగతి..... చూస్తా
నాకు అడ్డు రాకు
ఫ్రెండ్ వి అని కూడా చూడను

రాం కీ నవ్వొస్తుంది రాజన్ అవస్త చూసి

రాజన్ వెల్లకిలా ఫ్లోర్ మీద పడి

రేయ్ రాం నన్ను వదలరా...

రెండేళ్లు..... రెండేళ్లనుండి పిచ్చి వాడిలా అయిపోయా
ఆఫీసుకు సరిగ్గా వెళ్లడం లేదు. .. ఆఫీస్లొ సరిగ్గా నడుచుకోవడం లేదని ఉద్యోగంలొనుండి తొలగించారురా...
దీనంతటీకి కారణం తనే.

ఇప్పుడు కాని నువ్వు నన్ను వదలక పోతే చచ్చిపోతా రా రాం..
ప్లీజ్ రా ఒకె ఒక్క సారి నన్ను వెళ్ళనివ్వు.....
అని బ్రతిమాలు కుంటున్నాడు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజన్ ఫ్లోర్ మీద నుండి లేచి రాం కాలర్ పట్టుకుని అయినా నెను దాన్ని అనుభవించాలి అనుకుంటే నీకేంట్ర నొప్పి హా...అదేమైనా ని పెల్లామా లేక లవరా అని గద్దించినట్టు అడిగాడు రాజన్. ..

అవునురా...తనని నెను ప్రెమించాను అని గట్టిగా చెప్పాడు రాం

హొ హొ హొ హొ అని వెటకారంగా నవ్వి రాజన్

ఇదెప్పటినుండి సార్...
అయినా అందమైన అమ్మాయిని చూస్తె ప్రతి వాడికి ప్రేమ పుట్టుకొస్తుంది..
ఇంత అందమైన ఆమ్మాయిని చూస్తె..... అస్సలు ఆగ గలడా ఎవడైనా..
అని విలన్ లాగ మాట్లాడాడు రాజన్...

దానికి రాం కి కోపం వచ్చింది

రాజన్ చెంప మీద ఒకటి ఇవ్వబోయి ఆగాడు...
ఫ్రెండ్ వి అని ఆగాను... ఇంకొకడైతే....
అయినా నా గురించి నీకు తెలియదురా...
తనని నెను మొదటి సారి చూడగానే నా కల్లని నేనే నమ్మలేక పోయా...కల్లు మూసినా తెరిచినా తనే కనిపిస్తుంది. తన ద్యాస లొనుండి బయట పడటానికి నాకు ఒక రోజు పట్టింది..

నాలాంటి వాడికే అలా ఉంటే సాదారన మగాడివి నువ్విలా అయ్యావంటె ఆశ్చర్యం లేదు...

ఆమెకు బానిస అవ్వాల్సిందే....

అప్పుడే నాకు సందేహం కలిగింది. వెంటనే గురువుగారిని కలిసి ఇలా అడిగా.
మంత్ర శక్తి తెలుసు, తంత్ర శక్తి తెలుసు కాని ఒక మంత్రగత్తె మాత్రం రూపంతో ఎదుటివారిని తన బానిసలుగా చేసుకుంటుంది అది ఎలా సాద్యం గురూజి అని

అది మంత్ర శక్తి కాదు, తంత్ర శక్తి కాదు భగవంతుడు ఆమెకు ఇచ్చిన వరం. అటువంటి వారు చాలా అరుదు.. తరానికో, యుగానికో పుడతారూ అని చెప్పాడు.

అయినా నువ్వు ఆమెను కలిసి మూడు రోజులే కదా అయింది ఇంతలో ఎప్పుడు ప్రేమించావ్ అని కన్నింగా అడిగాడు రాజన్.

రాం కొంత మవునం తరువాత....
నేను అశ్రమం లొ మూడు రోజులు ఉన్నా

ఆరోజు రాత్రి అశ్రమంలో రాం గదిలో

ఒకరోజు ఆమె నా గదికి వచ్చింది రాత్రిపూట. నాకు భయం వేసింది ఇక జీవిత కాలం ఆమె నన్ను తన బానిసగా చేసుకుంటుందేమో అనుకున్నాను.

కాని ఆమె నా గదిలో ఒక ప్రక్కగా నిలపడి

నీకు నా గురుంచి తెలుసుకోవాలి అనుంది కదా. నేనెవరో నాకే తెలియదు. తను చేసిన పాపానికి ప్రక్షాలనగా ఒక స్త్రి నన్ను ఇక్కడ వదిలి వెళ్లిందట అని షాన్ చెప్పింది రాం తో.

ఎవరు చెప్పారు ఇది నీకు అని నెను ప్రస్నించాను

గురువుగారు

ఆవిడ చేసిన పాపం ఎంటో అడగలేదా

అడిగాను...గురువుగారు చెప్పలేదు

ఆయన చెప్పలేదా ఆయనకు తెలియదా

ఏమో నాకు తెలియదు

ఇంకా ఏం చెప్పాడు నిగురుంచి

నేను జీవిత కాలం ఇక్కడే ఉండాలట

రాం మనసులో అనుకున్నాడు నువ్వు ఇక్కడ ఉంటేనే అక్కడ మనుషులు సంతోషంగా ఉంటారు అని

రాం మవునంగా ఉండటాన్ని గమనించి ఏం ఆలోచిస్తునవ్ అని అడిగింది.
రాం కంగారుగా ఏం లేదు ఏం లేదు నువ్వు చెప్పు అన్నాడు

నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు ఈ ఆశ్రమం వదిలి వెల్లి పోవాలని ఉంది.
కాని గురువుగారు నన్ను వెల్లనిచ్చెవారు కాదు.
నేను ఎన్నో సార్లు గురువుగారిని బ్రతిమాలాను అయినా ఆయన ఒప్పుకోలేదు.

మామూలుగా ఈ ఆశ్రమం లోకి ఎవరూ రారు.. సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు.
తను ఒక విదేశీ వర్తకుడని గురువుగారికి చెప్పాడు.. అతను ఒక స్త్రీని వెదుకుతూ ఇండియాని కనుగొన్నా అని, కాని అక్కడ ఆ స్త్రీ లేదని చెప్పాడు..
దివ్య ఙానం కలిగిన మివంటి వారికీ తెలియని విషయం ఉండదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు.
గురువు గారు ఆ సంగతి నాకు తెలియదు అని చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ అతను ఒక చిత్రపటాన్ని గురువుగారికి ఇచ్చి వెళ్లారు. ఆ చిత్ర పటం గురువు గారి గదిలో ఉంటుంది అక్కడకు నాకు అనుమతి లేదు..

అప్పుడు రాం ఒక విషయాన్ని గమనించాడు వాం గురించి షాన్ మాట్లాడటం లేదు అంటే షాన్ కీ వాం కనిపించడు.. అంటే షాన్ దృష్టిలో ఆశ్రమం లో గురువుగారు తను మాత్రమే ఉన్నారనుకుంటుంది.అయితె వాం గాన్ని పట్టుకుంటే ఏవైన నిజాలు తెలిసే అవకాశం వుంది అని మనసులో అనుకుంటున్నాడు.

నెను ఇక్కడ ఒంటరిగా నరకం అనుభవిస్తున్నా నాకు ప్రపంచాన్ని చుట్టి రావాలని ఉంది.
ఈ భూమ్మీద ఉండే వింతలు విశేషాలు చూడాలని ఉంది.
అమ్మ ప్రేమ తండ్రి లాలన ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది వాటిని అనుభూతి చెందడం గొప్ప అదృష్టం.
నేను ప్రేమించడానికిగాని పోని నన్ను ప్రేమించడానికిగాని ఎవ్వరూ లేరు ఇక్కడ.
అస్సలు ప్రేమ లేని జీవితం వృధా అని నా అభిప్రాయం.
నిన్ను చూడగానే నాకు నచ్చావ్.

నిన్ను తప్ప మరో కుర్రాన్ని చూడలేదనుకో

నువ్వు వెళ్లేటప్పుడు నన్ను నితొపాటు తీసుకెల్లు నా జీవితాంతం నీతోనే ఉంటాను నీకు సేవలు చేసుకుంటూ నువ్వు ఎలా చెప్తే అలా వింటాను కావాలంటే నువ్వు నన్ను...ఎదో చెప్పాలనుకుని కళ్లల్లో నీల్లు తిరిగి గుండెల్లో బాద తన్నుకు రావడంతో నోరు పెగల్లేదు.. అంతటితో ఆపి తల వంచుకుని కల్లు తుడుచు కుంది షాన్.

రాం తన మనసులో అనుకున్నాడు

తనకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అదే ఆలోచనలతో ఒక అమ్మాయి ఉంది.

నిజానికి రాం కి కూడా తల్లి తండ్రి లేరు రాం చిన్నప్పుడే వారు చనిపోయారు. రాం నీ వాల్ల తాతయ్య పెంచాడు. షాన్ ని గురువుగారు పెంచినట్టు ఏటూ వెళ్లకూడదు.
తల్లి తండ్రి ప్రేమ కరువైతే ఆబాద ఎలా ఉంటుందో రాం కి తెలుసు
రాం కళ్లలో కూడా నీల్లు తిరిగాయి...
రాం బాద పడటం చూసి నన్ను క్షమించు. మిమ్మల్ని బాద పెట్టాను. ఒకవేల మీరు నన్ను ఇక్కడినుండి తీసుకెళ్లకపోతే నా జీవితాంతం నేను ఇక్కడే బానిసలా బ్రతకాలి. అలా బ్రతకడం నా వల్ల కాదు నువ్వు వెళ్లిన మరు క్షణం నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని చెప్పడంతో రాం భయపడ్డాడు.

నేను నిన్ను తీసుకెలతాను కాని నాకు కొంత సమయం కావాలి
నిన్ను వదిలి నేను ఇక్కడినుండి వెళ్లను అని రాం ఆమెకు మాట ఇచ్చాడు.
షాన్ ఎంతో సంతోషంగా రాం ని హత్తుకుంది
అప్పటికే సమయం తెల్లవారు జాము నాలుగయింది. గురువుగారు నిద్ర లేచే సమయం. ఆయన లెగవడానికి ముందె ఆయన మందిరాన్ని శుభ్రం చేయాలి అని షాన్ రాం గది నుండి పరుగున వెల్లి పోయింది.

రాం కొంతసేపు పడుకుని తొమ్మిది గంటలకి లేచాడు నేరుగా గురూజి మందిరానికి వెళ్లాడు అక్కడ షాన్ ఉంది. ఎమీ మాట్లాడకుండా వెనక్కి వచ్చాడు అక్కడి నుండి. వెల్లి వాం ని కలిసాడు. వాం ద్వారం దగ్గర కాపలా కాస్తున్నట్టు నెలబడి ఉన్నాడు.
రాం అతన్ని ఒక ప్రశ్న అడిగాడు
ఒక్కడివే ఈ కొండ మొత్తం ఎలా కాపలా కాస్తున్నావ్ అని
దానికి వాం ఈ కొండకి కాపలా కాసేది నెను కాదని గురువుగారే చూసుకుంటున్నారని చెప్పాడు. ఆయన నిద్రలో ఉన్నప్పటికీ ఆయన దివ్య దృష్టి నుండి ఈ కొండమీద చిన్న చీమ కూడా తప్పించుకోలేదని చెప్పాడు వాం.

ఈ ఆశ్రమాన్ని చేరుకోవడం చాలా కష్టం కాని నువ్వు ఎలా వచ్చావొ నాకు ఇప్పటికీ అర్దం కావడం లేదు అన్నాడు వాం.

నిజమే కాని నాకు ఇలాంటి సాహసాలు కొత్తేమి కాదు. కాని ఈ మార్గం చాలా కష్టంగా ఉంది.

మరో దారి ఎదైణా వుందా అని అడిగాడు రాం
అవును ఆశ్రమం వెనుక నుండి ఒక దారి వుంది అది చాలా సులువైనదీ. కావాలంటే నువ్వు వెళ్లే టప్పుడు ఆ మార్గం గుండా వెళ్లొచ్చు అని సలహా ఇచ్చాడు వాం.

సలహా కి థాంక్స్ చెప్పి వెల్లిపోతుండగా. ఆ మార్గం సులువైనదే కాని ఇప్పుడు ఎలా వుందో తెలియదు. ఐదు వందల ఏళ్ల క్రితం ఒక విదేశీయుడు ఆ మార్గం గుండానె ఆశ్రమం చేరుకున్నాడు.
అని వాం రాం ని హెచ్చరిచాడు.

అప్పుడు రాం కి ఒక విషయం గుర్తుకు వచ్చింది ఆ అయిదు వందల ఏళ్ల క్రితం వచ్చిన వ్యక్తి గురువుగారికి ఒక చిత్ర పటం ఇచ్చాడు అని షాన్ చెప్పిన విషయం. కాని అది గురువుగారి గదిలో ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లలేరు. ఎందుకంటె ఇక్కడ చీమ చిటుక్కు మన్నా గురువుగారికి తెలుస్తుంది. మరెలా గురూజి గదిలోకి వెళ్లడం, ఇక్కడి నుండి షాన్ ని ఎత్తుకెల్లడం
రాం కి ఏం చెయ్యాలొ ఎలా చెయ్యాలొ ఎక్కడ మొదలు పెట్టాలో అర్దం కావడంలేదు.

వెల్లి షాన్ ని కలిసాడు. ఆశ్రమం అంతా తిరిగి చూస్తె ఎదైణా క్లూ దొరకొచ్చునేమో అని చెప్పి అలా ఆశ్రమం లో ఉన్న గుడి వైపు వెళ్లాడు రాం

ఇదిలా ఉండగా గురువుగారు చేతిలో గ్రంధం తో రాం గదికి బయలుదేరాడు. షాన్ అది గమనించి వెంటనె రాం వెళ్లిన వైపు వెల్లింది. రాం గుడి ఆవరణ లొ ఉన్నాడు
షాన్ రాం ని కలిసి గురువుగారు గ్రంధం తో నీ గది వైపు వెళ్లాడు ఆయన నీ గదిని చేరుకునే లోగా నువ్వు నీ గదిలో ఉండమని చెప్పింది. వెంటనే రాం తన గదికి వెళ్లాడు. రాం వెళ్లిన కొన్ని క్షానాల తరువాత గురువుగారు రాం గదికి వెళ్లారు.

అప్పుడే ఒక అద్భుతం జరిగింది.

రాం ని హెచ్చరించడానికి గుడి ఆవరనం లోకి వెళ్లింది షాన్ .
అప్పుడు షాన్ ఒక విషయాన్ని గమనించింది.
తను ఇన్నేళ్ల నుండి ఇక్కడ ఉన్నా ఎప్పుడూ ఈ గుడి ఆవరణలోకి రాలేదని.
గురువుగారు ఇప్పుడు రాం ఉన్న గదిలోకి ఇంతక ముందు ఎప్పుడూ వెల్లలేదని గమనించింది. వెంటనే ఈ విషయం రాం తో చెప్పాలని రాం గది వైపు పరుగు తీసింది.

షాన్ రాం గది దగ్గరకు వెళ్లేసరికి గురువుగారు మరియు రాం ఎదో మాట్లాడుకోవడం గమనించి రాం గది బయటే ఆగి కొన్ని క్షణాల తరువాత అక్కడినుండి వెళ్లిపోయింది.

గురువు గారు, రాం తో మాట్లాడటం పూర్తయ్యాక గురువుగారు రాం గది నుండి వెళ్లిపోయారు.

గురువు గారు వెళ్ళేవరకూ ఆగి ఆయన వెళ్లగానే రాం గదిలో దూరి గట్టిగా కవుగిలించుకుది షాన్ రాంని.
రాం కి ఎమీ అర్దమ్ కాలెదు రాంకి.

షాన్ సంతోషంగా ఉండటం గమనించి షాన్ కి ఏదో తెలిసి నట్టుంది అనుకుని నీకు ఏం అర్డమయింది నాతో చెప్పు అంటూ షాన్ ని అడిగాడు.

షాన్ రాం చేయి పట్టుకుని గదిలో నుండి గుడి దగ్గరకు తీసుకెళ్లింది.

ఇద్దరూ ఆ గుడి ఆవరణలో నిలబడి ఉన్నారు
షాన్ అతన్ని గుడి చుట్టూ తిప్పి చూపించింది.

రాం కి ఏమి అర్థం కాలేదు షాన్ మొహం వైపు అదోలా చూశాడు అప్పుడు షాన్ నీకు ఇంకా అర్థం కాలేదా ఈ గుడి చుట్టూ మనం తిరిగాము కానీ గుడి లోపలికి వెళ్లే ద్వారం ఎక్కడా లేదు అంటే ఈ గుడికి ద్వారం ఎక్కడ ఉంది అని చెప్పింది.

రామ్ ఆశ్చర్యపోయాడు ఇప్పటికే అతను ఈ గుడి దగ్గరికి రెండు సార్లు వచ్చాడు అయినా అతను ఈ విషయాన్ని గమనించలేదు ఇప్పటివరకు తనే తెలివైనవాడు అనుకునేవాడు కానీ ఎంత తెలివైనవాడు ఐనా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారని రామ్ కి అర్థమయింది ఇప్పుడు ఈ గుడికి వెళ్లే ద్వారం ఎక్కడుందో కనిపెట్టాలి.
అప్పుడు షాన్ ఈ గుడికి వెళ్లే ద్వారం బహుశా నువ్వు ఉన్న గదిలోనే ఉండి ఉండొచ్చు పదా వెళ్లి వెతుకుదాం అని ఇద్దరు అక్కడినుండి హుటాహుటిన బయలుదేరారు రామ్ గదిలోకి

ఆ గది చాలా చిన్నది గదిలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్నంగా పరిశీలించారు అయినప్పటికీ వారికి ఎటువంటి ఆధారం లభించలేదు అయితే ఆ గుడికి వెళ్లే ద్వారం ఈ గదిలో లేదనుకున్నారు.
మరి ఎక్కడ ఉండొచ్చు అని ఆలోచించారు

షాన్ గురువు గారి గది లో వెతుకుదాం అని అడిగింది. వెతుకుదాం కానీ నేను మాత్రమే వెళ్తాను నువ్వు రావద్దు అని చెప్పాడు. ఎందుకని అడిగింది షాన్ ఇప్పటివరకు నువ్వు ఒక్కసారి కూడా ఆ గదిలోకి వెళ్ళలేదు. గురువుగారు ఎందుకని నిన్ను ఆ గదిలోకి వెళ్ళకుండా ఆ పారు. ఏదో కారణం ఉండి ఉండొచ్చు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కడినే వెళ్లి గురువుగారి గదిని వెతుకుతా.
కానీ గురువుగారు లేని సమయంలో మాత్రమే అది చేయగలం. అదే ఎలా..... అని అడిగాడు రాం
అది ఇప్పుడే అని షాన్ సమాధానం చెప్పింది.

సాధారణంగా గురువుగారు ఈ ఆశ్రమంలో ఉండే ప్రతి జీవి మీద ఒక కన్నేసి ఉంచుతారు. కానీ ఆయన నిద్రలో ఉన్నప్పుడు తప్ప. ఇప్పుడు ఆయన మధ్యాహ్న భోజనం చేసి ఆయన గదిలో నిద్ర పోతారు. ఆ సమయంలో మనం అంటే నువ్వు ఒంటరిగా గదిలో వెతకాలి.
రామ్ గుండె డబడబా కొట్టుకుంటుంది సింహం గుహలోకి వెళ్లి చికెన్ ముక్క పట్టుకు రావాలి ఏ మాత్రం అలికిడి అయినా చికెన్ ముక్క బదులు నన్ను తినేస్తుంది. కానీ తప్పదు వెళ్లి తీరాలి ప్రేమించిన అమ్మాయి కోసం అని
అనగానే షాన్ సిగ్గుగా రాం వైపు చూసి నవ్వింది
గురువుగారు భోజనం చేసే సమయం అయ్యింది కనుక నేను వెళ్లి గురువుగారికి భోజనం వడ్డించి వస్తా ఆయన భోజనం చేసి పడుకోగానే నువ్వు వెళ్ళు అని రామ్ కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro