yavvanam 3

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

ఒక స్త్రీకి కేవలం పురుషుడి ద్వారా మాత్రమే సంతానాన్ని పొందే సౌకర్యం ఉందంటే నేను ఏమాత్రం దాన్ని అంగీకరించను.
సృష్టిలో పురుష ప్రమేయం లేకుండా సంతానాన్ని పొందుతున్న జీవులు చాలా ఉన్నాయి. ఆ సౌకర్యం మనిషికి (స్త్రీ కి) కూడా ఉందని నేను గట్టిగా చెప్పగలను. అంతే కాదు పూర్వము ఒక స్త్రీ....అని ఎదో చెప్పబోతుండగా తలుపు తీసిన చప్పుడు విని. అప్పటి వరకు తన ద్యాన మందిరంలొ ఉన్న గురువుగారు మందిరం తలుపు వైపు చూసాడు. షాన్ తలుపు తీసుకుని లోనికి రావడం గమనించి మిగతా విషయాలు తరువాత చర్చించుకుందాం అని చెప్పి లోనికి వస్తున్న షాన్ ని భోజనం సిద్దం చేయమన్నాడు.

అలాగే గురువర్య అంటూ షాన్ మరలా వచ్చిన ద్వారం గుండానే బయటికి వెళ్లింది వెళుతూ తలుపు మూయలేదు అలాగే తెరిచి ఉంచి వెళ్లిపోయింది.

షాన్ కి చిన్న సందేహం కలిగింది. నేను లోపలికి వెళ్లేసరికి గురువుగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు.. మందిరంలో గురువుగారు తప్ప మరెవరూ లేరు. మరి గురువుగారు ఎవరితో మాట్లాడుతున్నాడు.అని తనలో తానే అనుకుని. మనకెందుకులే అని వంట శాల వైపు నడిచింది. గురువుగారికి భోజనం సిద్దం చేయడానికి.

షాన్ గురువుగారికి భోజనం సిద్దం చెయడానికి వెళ్ళాక రామ్ తన గదిలో ఒక్కడే ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాంగదిలోకి వాం వచ్చాడు. వాం వస్తూనే తలుపు మూసి గొళ్ళెం పెట్టాడు.

నువ్వు ఎవరు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇది ఒక మాయా ప్రపంచం ఇక్కడ ఎవరూ మంచి వాళ్ళు లేరు అందరూ నిన్ను మోసం చేస్తారు. ఒకప్పుడు నేను కూడా నీలాగే ఇక్కడికి వచ్చాను వాళ్లు నన్ను ఇక్కడ బానిస గా మార్చారు నిన్ను కూడా ఇప్పుడు అలాగే మారుస్తారు వీలైనంత త్వరగా ఈ మాయా ప్రపంచం నుండి బయటపడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇక్కడ ఎవరినీ నమ్మవద్దు నీ కంటికి కనిపించిన దాన్నీ, కనిపించని దాన్ని కూడా అని వాం రాంని హెచ్చరించినట్టు చెప్పాడు.

మరి నువ్వు ఇక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేయలేదా అని రాం అతన్ని అడిగాడు.

మొదట్లో చేశాను కానీ ఇక్కడి నుండి బయటపడటం అంత సులువు కాదు. ఈ ఆశ్రమం మొత్తం మీరు గురువు గారు అని చెప్పుకునే వాడి చేతిలో ఉంటుంది. వాడే నన్ను ఇక్కడ బానిసగా మార్చాడు అంతే కాదు నేను నీ కంటికి కనిపిస్తున్నానని నాకు తెలుసు కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నీ కంటికి కనిపించని వందలాది మంది ఈ ఆశ్రమంలో ఉన్నారు వాళ్లు కూడా నాలాగే బానిసలు. రామ్ కి ఏమీ అర్థం కాలేదు తను పూర్తిగా ఏది తెలుసుకోకుండా వచ్చి ఈ ఊబి లో ఇరుక్కుపోయాను అని వామ్ తో చెప్పాడు.

మరి నేను ఇక్కడి నుండి బయటపడడం ఎలా అని అడిగాడు రాం అతన్ని.
అది మాత్రం నాకు తెలియదు అని చెప్పాడు వామ్.

ఈలోగా అక్కడ గురువుగారు భోజనం చెయడం పూర్తయింది. భోజనం తరువాత తన గదిలో పడుకోవడానికి వెల్లి పోయాడు.

గురువుగారి గది ఆశ్రమం పై అంతస్తులో ఉంటుంది.

రాం మెల్లగా గురువుగారి గధివైపు నడిచాడు షాన్ హాల్లో గురువుగారు భోజనం చేసిన బల్లని శుభ్రం చేస్తుంది.

రాం వైపు చూసి వెళ్లు అని సైగ చేసింది.

రాం భయ పడటంలెదు అందుకని ధైర్యంగా కూడా లేడు. మెల్లగా పైకి చూస్తూ మెట్లు ఎక్క సాగాడు.

గురువు గారి గది తలుపు వేసి ఉంది.

రామ్ వెళ్లి తలుపు ముందు నిలుచున్నాడు. ఒక క్షణం ఆగి మెల్లగా తలుపుని తోశాడు లోపల గురువుగారు మంచం పై పడుకొని ఉన్నారు. చప్పుడు లేకుండా గదిలో ముఖ్యమైన భాగాలు వెతకసాగాడు.

కింద అంతస్తులో భోజన బల్లా శుభ్రంచెయడం అయ్యాక షాన్ రాంగదికి వెళ్లింది అక్కడ ఎవరూ లేరు. షాన్ కి కొంచెం కంగారుగా కూడా ఉంది. తన చేతిలో ఒక కత్తి కూడా ఉంది. ఆ కత్తి గురువుగారి సొంతది ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే గురువుగారు ఆ కత్తిని బయటకు తీస్తారు. కానీ ఆ కత్తి ఇప్పుడు షాన్ చేతిలో ఉంది, షాన్ రాం గదిలో ఉంది.

ఈలోగా రాం ఇంకొంచెం క్షున్నంగా వెతకడం మొదలు పెట్టాడు అప్పుడు ఒక చెక్క పెట్టెలో ఒక పెయింటింగ్ నీ గమనించాడు రామ్. ఆ పెయింటింగ్ అచ్చు తన దగ్గర ఉన్న పెయింటింగ్ లాగే ఉంది కానీ తన దగ్గర ఉన్నది నకిలీ. గురువు గారి గది లో చూసింది అసలైనది. రాం దానిని భద్రంగా తనతోఉంచుకున్నాడు. మెల్లగా మరో పెట్టెను వెతకడం కోసం దాన్ని తెరిచాడు.

ఈలోగా హఠాత్తుగా గురువుగారు లేచారు.
ఊహించని ఈ పరిణామానికి రాం బిత్తరపోయాడు. గురువు గారు లేచి మంచం మీద కుర్చుని దగ్గుతున్నారు ఆయన నోటి వెంట రక్తం వస్తుంది. రాం తేరుకుని ఏమయింది ఏమయింది అంటూ గురువుగారి పక్కన వచ్చి నిలుచున్నాడు.
నాకు ఎం పరవాలేదు రాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను

తను నిన్ను చంపేస్తుంది ఇక్కడి నుండి పారిపో త్వరగా అని చెప్పాడు.

నాకేమీ అర్దం కావడంలేదు

మీకు ఏమయింది?.
తనెవరు?
నన్ను ఎందుకు చంపుతుంది?
అంత సమయం లేదు ముందు ఈ ఆశ్రమం నుండి బయట పడు త్వరగా చెప్పాడు గురువుగారు.

కాని ఇక్కడి నుండి ఎలా బయట పడటం. అని అడిగాడు ఈ ఆశ్రమం లోకి రావడానికి ఒక ద్వారం. బయటికి వెళ్లడానికి ఒక ద్వారం ఉంటుంది.

ఆ బయటికి వెళ్లే ద్వారం ఎక్కడ వుంది అని అడిగాడు.

నీ గదిలోనే ఉంది వెళ్లు త్వరగా త్వరగా అని గురువుగారు చెప్పారూ.

రాం హడావిడిగా తన గదికి పరుగెత్తాడు. అక్కడ షాన్ కత్తితో సిద్దంగా ఉంది.
రాం తలుపు తీయగానే ఎమైనా దొరికిందా అని అడిగింది. ఏం దొరకలేదు. కాని బయటికి వెళ్లే దారి నా గదిలోనే ఉంది అన్నారు ఆయన.
కాని ఈ గడిలో నాకు ఏమి కనపడలేదు అలాంటి ద్వారం.
ఇప్పుడు ఇలా
బాగా ఆలోచించు రాం అనింది షాన్.

ఎంత ఆలోచించినా రాం కి ఏమీ గుర్తు రావడం లేదు.
అలా కొన్ని క్షానాల తరువాత తనకు ఒక విషయం గుర్తుకు వచ్చింది.

కొన్ని క్షానాల క్రితం వాం తనని కలవడానికి వచ్చాడు వస్తూనే తలుపు గొల్లెం పెట్టాడు.
తరువాత ఈ ఆశ్రమం లొ ఎవరినీ నమ్మొద్దు అని చెప్పాడు. దేన్ని నంమొద్దని చెప్పాడు.
నాకు ఇప్పుడే అర్డమయింది ఈ ఆశ్రమం లో ఉన్నా గుడికి తలుపు లేదు అని మనం అనుకున్నాం కాని ఉంది అది మనకు కనిపించలేదు కా వాలంటె నువ్వు ఇక్కడ నా గదిలో ఉండు లోపల గడి పెట్టుకుని నేను గుడి దగ్గరకు వెల్లి చూస్తాను అన్నాడు
నిజంగానే రాం గుడిదగ్గరకి వెళ్లేసరికి గుడి కీ ఒక తలుపు ఉంది, అది కూడా తెరిచి ఉంది.

వెంటనే రాం తిరిగి తన గదికి తిరిగి వచ్చాడు లోపల గడి పెట్టుకుని ఉన్న షాన్ ని బయటికి రంమాన్నాడు. షాన్ బయటికి వచ్చింది. గుడి తలుపు తెరిచి ఉంది అని ఇద్దరూ అక్కడికి వెళ్లారు కాని అక్కడ గుడి ఇంతకు ముండులాగే ఉంది.
తలుపు తెరిచి లేదు.

రాం కి ఏం అర్దం కాలెదు

షాన్ వైపు చూసి...సరే నువ్వు ఇక్కడే ఉండు నెను నా గదిలోకి వెల్లి టలుపెసుకుని గడి పెట్టుకుంటా అని తన గదికి వెల్లి టలుపెసుకుని గడి పెట్టుకున్నాడు ఇక్కడ ఇక్కడ గుడి తలుపు తెరుచు కుంది.
షాన్ ఆశ్చర్య పొయింది అది చూసి.
మరలా వెంటనె

అప్పుడు రాంకి విషయం అర్దమయింది.

ఎవరైనా అథిది ఈ ఆశ్రమం లోకి వస్తే వారిని బయటికి పంపించడానికి. గురవుగారు వచ్చిన అథిదిని నా గదిలో ఉంచి లోపల గడిపెట్టుకొమంటాడు. అప్పుడు గుడి తలుపు తెరుచు కుంటుంది వెంటనె గురువుగారు గుడి లోపలికి వెల్లి తలుపు వేసుకుంటాడు. అథిది నా గదిలో తలుపు తెరిచే సరికి తను ఆశ్రమం బయట ఉండొచ్చు అనుకుంటూ రాం ఊహించు కున్నాడు.

అందుకే షాన్ పారిపోకూడదని షాన్ ఎప్పుడూ ఈ గుడి ఆవరణలోకి రానివ్వలెదు. కాని ఈ ద్వారాన్ని ఉపయోగించాలి అంటే కనీసం ముగ్గురు ఉండాలి కాని తనూ షాన్ మాత్రమే ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఇద్దరం బయటికి వెళ్లాలి అంటే మూడో వ్యక్తి కావాలి.
వాం ఏమయిన సహాయం చెస్తాడేమో గుమ్మం ఆశ్రమం ప్రదాన ద్వారం దగ్గర నిలబడి ఉన్న వాం ని కలిసాడు. వెనకాలే షాన్ కూడా పరుగెత్తి వచ్చింది.

రాం వాంని సహాయం చేయమని అడిగాడు.. వాం నెను నిజం కాదని, నెను మికు ఏ సహాయం చెయ్యలెను అని చెప్పాడు.

వాం షాన్ కి కనిపించని కారణం చేత ఎవరితో మాట్లాడుతున్నావు అని రాం ని అడిగింది.

ఏం లేదు ఎవరూ లేరు అని రాం చెప్పాడు
🌟🌟🌟🌟🌟

రాంఇంట్లో....

అలా మూడురోజుల్లొ తను నీమీద అంత నమ్మకం పెంచుకుంద న్నమాట. అని ఫ్లొర్ మీద పడిఉన్న రాజన్ అన్నాడు రాం తొ

హాల్లో ఫ్లోర్ మీద పడుకుని ఉన్న రాజన్ అడిగాడు రాం ని

గురువుగారు నీతో.. "తను వచ్చేస్తుంది, నిన్ను చంపేస్టుండి" అన్నాడు కదా ఎవరా తను అని అడిగాడు రాజన్.

నాకూ తెలియదు బహుశా ఆయన కూతురు అయి వుండొచ్చు లేదా బార్య అయి ఉండొచ్చు లేదా షాన్ ని ఆశ్రమం లో వదిలి వెళ్లిన స్త్రి అయుండొచ్చు. అని పనికిమాలిన సమాదానం చెప్పాడు రాం.

కానీ నిజానికి అదే కరెక్ట్ సమాదానం.

మరి ఆశ్రమంలొనుండి ఎలా బయటపడ్డారు? అని అడిగాడు రాజన్
హా....అదెందుకులె ఇప్పుడు... ఎలాగోలా పడ్డాము అని నిట్టూరుస్తు చెప్పాడు రాం.

రాజన్ ఫ్లోర్ మీద నుండి లేచి టెన్షన్ తట్టుకోలేక ఒక దమ్ము వెద్దాం అని బాల్కానిలొ కి వెళ్లాడు రాం కూడా పక్కనే నిలపడ్డాడు. కాని రాంకి సిగరెట్ అలవాటు లేని కారణం చేత రాం సిగరెట్ కాల్చడంలేదు.

రాజన్ మాత్రం దమ్ము మీద దమ్ము లాగెస్టున్నాడు చాలా టెన్షన్ గా ఉన్నాడు.

అప్పుడు రాం కూడా ఎదో అలోచనలో పడ్డాడు...

రాజన్ వలన ఎప్పటికైనా షాన్ కి ప్రమాదమే.రాజన్ గురించి రాం కీ బాగా తెలుసు.తన కోరిక తీర్చుకొవడం కోసం ఎంత కైనా తెగిస్తాడు.
అందుకే బాల్కనీలో నిలపడి సిగరెట్ త్రాగుతున్న రాజన్ ని క్రిందికి తోసెసాడు రాం.
ఊహించని ఈ పరిణామాన్ని తెలుసుకునే లోగా రాజన్ అమాంతం వెల్లి నేలమీద పడ్డాడు. వెంటనే రాం కూడా మెట్లు దిగి క్రిందికి వెళ్లాడు ఒక కాలు విరిగింది తలకు రక్తం కారుతుంది. రాజన్ ఇంకా చావలేదు. రాం నడుచుకుంటూ మెట్లు దిగి వెల్లి రాజన్ పక్కన కూర్చుని... రే రాజన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అయినా నిన్ను ఎందుకు చంపుతునానో తెలుసా. నువ్వన్నావే అవసరమయితే నిన్ను చంపి ఆ తరువాత షాన్ సంగతి చూస్తా అని అందుకు కాదు.

నెను షాన్ తల్లిని పెళ్లి చేసుకోవాలి..
కాని తను ఎక్కడ ఉందో నాకు తెలియదు.
అంతే కాదు ఆమె ప్రియురాలు కూడా ఎక్కడ ఉందో నాకు తెలియదు. వాల్లని నెను కనిపెట్టేవరకు షాన్ నా దగ్గర భద్రంగా ఉండాలి.
షాన్ నాదగ్గర ఉండాలి అంటే తనకు ఎటువంటి ప్రమాదం లేదని తను నన్ను నమ్మాలి.
అందుకోసమె ఇది అని కన్నింగ్ వాయిస్ లో చెప్పాడు రాం.

అప్పటికే చాలా రక్తం పొయింది..
రాజన్ రాంని చూడగలుగుతున్నాడు కానీ ఏమీ మాట్లాడే స్తితిలొ లేడు.

నా లక్ష్యం షాన్ కాదు, ఆమె తల్లి కాదు ఆమె ప్రేయసి కూడా కాదు

నేను నా లక్ష్యాన్ని సాదించడంలో నీ సేవలు ఇప్పటి వరకు బాగానే వినియోగించావు. ఇక చాలు నీ సేవలు నాకు అవసరం లేదు.
రాజన్ గిల గిల కొట్టుకుంటున్నాడు
కొంత సేపటి తరువాత అంబులెన్స్ వచ్చి రాజన్ సెవాన్ని తీసుకెళ్లింది.
రాం ఇంటిలోపలికి వెళ్లాడు
షాన్ రాం గదిలో కంగారుగా ఉంది
రాం రాగానే..ఎవరతను ఎందుకు అలా పిచ్చి వాడిలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగింది.
అవును అతనికి పిచ్చి, నీకేం పరవాలేదు అని రాం ఆమెకు హామీ యిచ్చినట్టు చెప్పాడు.

ఇంట్లో ఎవ్వరూ లేరేంటీ... పైగా ఇంటి చుట్టూ వంద మందికి పైగా తుపాకిలు పట్టుకుని సైనికులు ఉన్నారు. మీ అమ్మ నాన్న అక్క తమ్ముడు అంటూ ఎవరూ లేరా అని అడిగింది షాన్.

ఒకప్పుడు ఉండెవారు అందరూ చనిపోయారు అని బాద పూరితమయినా గొంతుతో చెప్పాడు రాం

అవునా నన్ను క్షమించు ఇలా అడిగి బాదపెట్టినందుకు

పరవా లేదు
వారు నా చిన్నప్పుడే చనిపోయారు కాని వారి చావు యాదృచ్ఛికం మాత్రమే
వారు తిరిగి బ్రతుకుతారని నా నమ్మకం అని దృడంగా చెప్పాడు రాం

అదేంటి చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారా చాలా ఆశ్చర్యంగా ఉందే అని షాన్ ఆశ్చర్య పోయి అడిగింది.

కాని వారు ఎలా చనిపొయారొ అన్న నిజం షాన్ కి తెలియదు.

మరి నీకు పెళ్లి అవ్వలేదా అని అడిగింది షాన్
అవలేదు అని చెప్పాడు రాం
కాని షాన్ కి అది నమ్మాలని లేదు

మరి ఎవరినైనా ప్రెమించావా అని అడిగింది

అవును ప్రేమించాను.. తను ఒక యువరాణి, దేవతల మతులు సైతం పోగొట్టే అందం ఆమెది.

ఎవరామె? అని అడిగింది షాన్

అప్పుడు షాన్ని తన పర్సనల్ బెడ్ రూమ్ లోకి చేయి పట్టుకుని తీసుకెళ్లాడు రాం. ఆ గదిలో గోడమీద ఒక పేయింటింగ్ ఉంది. ఆ పేయింటింగ్ లొ ఇద్దరు అమ్మాయులు ఒకరిని ఒకరు ఘాడంగ హత్తుకుని ఉన్నారు. వారిలో ఒకరిని చూపించి ఆమెనే నేను ప్రెమించాను. ప్రతి రోజు కలలొ ఆమె నా గదిలోకి వచ్చి ఎన్నో విషయాలు చెప్తుంది. అని రాం అమెకు చెప్పాడు
షాన్ అది విన్నాక ముసి ముసి నవ్వుతో మొదలెట్టి బిగ్గరగా నవ్వుతూ పక్కనే ఉన్న బెడ్ మీద వాలి పొయి తమాషా బావుంది అనింది.

రాం కూడా కొంచెం నవ్వి.. సరే బాగా ఆకలేస్తుంది ఏదైనా తిందాం రా అని భోజన శాల వైపు నడిచారు.
అక్కడ అనేక తిను బండారాలు సిద్దగా ఉన్నాయి
షాన్ ఆశ్చర్యపోయింది ఇవన్ని ఎవరు సిద్దం చెసారు అని అడిగింది
నా కోసం ఒక పనావిడ పక్కనే ఉన్న ఔట్ హౌస్ లో ఉంటూ ఇవన్నీ చూసుకుంటుంది అని చెప్పాడు రాం

అంటే నేను ఆశ్రమం లో గురువుగారిని చూసుకున్నట్టు.

అవును అలాగే అనుకో

మరి అప్పుడప్పుడూ గురువుగారు నన్ను అర్ద రాత్రులు అపరాతృలు తన గదికి రమ్మంటారు. నువ్వు కూడా ఈమెను పిలుస్తావా అని సందేహంగా అడిగింది షాన్.

గురువుగారు పిలిస్తే నువ్వు వెల్లేదానివా అని అడిగాడు రాం

తప్పకుండా వెళ్ళాలి ఇష్టం ఉన్నా లేకున్నా అని ఉసూరుమంటూ చెప్పింది షాన్.

నెను పిలిస్తే ఈమె కూడా వస్తుంది.. ఎన్నో సార్లు పిలిచాను కూడా
అని తడుముకోకుండా చెప్పాడు రాం.

అయితే ఈ రోజు రాత్రికి పిలువు అని చెప్పింది షాన్

ఎందుకు అని అర్దం కానట్టు అడిగాడు రాం.

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro