yavvanam 30

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng


ఒకనాటి సాయంత్రం.. మధు, షరీఫ్ ఒక కాఫీ షాపులో కూర్చుని ఉన్నారు మౌనంగా. ఇద్దరూ ఏమీ మాట్లాడటం లేదు.. ఈలోగా వేడి వేడిగా కాఫీ వచ్చింది.. ఇద్దరూ కాఫీ త్రాగడం మొదలు పెట్టారు.. మధు నార్మల్గా ఉంది. కానీ షరీఫ్ కొంచెం టెన్షన్
గా ఉన్నాడు..

మదు కాఫీ త్రాగడం పూర్తి చేసి.. కప్పు పక్కన పెట్టి.
దారి మద్యలో బండాపి.. నీతో మాట్లాడాలి అనిచెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొబెట్టావ్. కానీ ఏమీ మాట్లాడ కుండా ఉన్నావ్.. మాట్లాడేదేమైనా ఉంటే మాట్లాడు..లేదంటే వెళ్ళిపోదాం అనింది మధు నిక్కచ్చిగా..

అదీ..అదీ.. అని షరీఫ్ నసుగుతూంటే.

సరే.. ఒక పని చెయ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో..అది మొత్తం ఒక పేపర్ మీద రాయండి.. లైక్ ఎ లెటర్ అన్నమాట.. రాసి రేపు నాకు ఇవ్వండి అనింది మధు..

సరే అన్నాడు షరీఫ్..

కానీ రాసేప్పుడు.. నా పేరు వాడకండి.. అనింది మదు

ఎందుకు అన్నాడు షరీఫ్..

ఎందుకంటే పొరపాటున అది ఎవరికంటైనా పడితే నాకు సమస్య రాకూడదు కదా అనింది మధు..

మరి ఏ పేరు పెట్టమంటావ్ అన్నాడు షరీఫ్..

నీ ఇష్టం.. నీ నోటికి ఏ పేరు వస్తే అది రాయి అనింది మధు.

షరీఫ్ కొన్ని పేర్లు చెప్పాడు.. అందులో ఒక పేరు సెలక్ట్ చేసింది మదు.

అలాగే అన్నాడు షరీఫ్..

సరే రా ఇక ఇంటికి వెళదాం అని ఇద్దరూ బైక్ మీద ఇంటింబాట పట్టారు..

టైం ఏడయింది..

షరీఫ్ ఇంటికి వచ్చే సరికి రుక్కూ దిగాలుగా సోఫాలో కూర్చుని ఉంది..

అలసిపోయి ఆఫీసు నుండి వచ్చినట్టు.. షరీఫ్ ఫ్రెష్ అవుతున్నాడు.

ఈలోగా రుక్కూ ఇంటికి మధుకూడా వచ్చింది..

వస్తూనే.. హాయ్ బేబీ అని రుక్కూ బుగ్గలు నొక్కింది..

ష్ .. మా ఆయన ఉన్నాడు ఇంట్లో అనింది రుక్కూ మెల్లగా..

మదు కూడా మెల్లగా.. నాకు తెలుసు అందుకే బుగ్గలు నొక్కా..లేకపోతే అని ఏదో చెప్పబోయేలోగా రుక్కూ అని పిలుపు వినిపించింది బెడ్రూంలోనుండి.. ఆ పిలుపు వినబడగానే టక్కున సొఫాలొనుండి లేచి బెడ్రూంలోకి వెళ్లింది రుక్కూ..

కాసేపటి తరువాత రుక్కూ హాల్లోకి వచ్చి రాం కి ఫోన్ చేసింది.

ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. మరలా ట్రై చేసింది లిఫ్ట్ చెయలెదు

కోపం వచ్చి.. విసుగ్గా ఫోన్ దూరంగా విసిరేసింది రుక్కూ..

ఎంటి బేబీ ఫోన్ అలా విసిరెసావ్.. అనింది మదు

రాంకి..చాలాసేపటి నుండి ట్రై చెస్తున్నా.. లిఫ్ట్ చేయడంలేదు అనింది రుక్కూ చిరాగ్గా..

నా నంబర్ నుండి ట్రై చేస్తా ఉండు అని మధు డయల్ చేసింది..

☆☆☆☆☆

స్పృహ లేకుండ జీపులో పడి ఉన్నాడు రాం..
ఆ జీపు మెల్లగా గ్యారేజీకి వెళ్లింది..
స్పృహ లేకుండ ఉన్న  రాంని జీపులోనుండి లాక్కెళ్ళి గ్యారేజీలొ క్రింద పడేసారు.. ఆ నేలంతా డీసిల్ మరకలతో.. ఆయిల్ తుడిచిన మసి బట్టలతో  దుమ్ము దుమ్ముగా ఉంది..

రాం స్పృహ లేకుండా ఆ దుమ్ములోనే పడి ఉన్నాడు..

చుట్టూ వందమంది ఉన్నారు కత్తులు రాడ్డులు పట్టుకుని.. ఎదురుగా చైర్లో కూర్చుని గోవిందరామన్ ఉన్నాడు.. రాం రెండు కాల్లు కట్టేసి ఉన్నాయి.. రెండు చేతులూ వెనక్కి మడిచి కట్టేసి ఉన్నాయి..తలకైన గాయం వలన రక్తపు మరక అయింది షర్టుకి వెనుక.

చుట్టూ ఉన్న వాళ్లు రాం కి ఎప్పుడు మెలుకువ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు..

ఇంతలో రాం ఫోన్ మ్రోగింది.. ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు.

మరలా మరలా మ్రోగింది.. ఐనా తియ్యలెదు

నిమిషం తరువాత మరలా మ్రోగింది..

రేయ్ ఆ ఫోన్ ఎంటో చుడరా అన్నాడు గోవింద రామన్.. పక్కనున్న అతని చెంచాతో..

వాడు రాం జేబులోనుండి ఫోన్ తీసీ. లిఫ్ట్ చేసి హలో అన్నాడు..

రేయ్ నీకు తెలుంగ్ తెలుసా అన్నాడు గోవింద రామన్..ఫోన్ తీసిన చెంచాతో

తెలీదయ్య అన్నాడు ఆ చెంచా..

మరి మూసుకుని..ఆ ఫోన్ తీసుకుని ఇలారా అన్నాడు గోవిందం..

వాడు ఆ ఫోన్ గోవిందంకి చ్చాడు..

గోవింద రామన్ ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని..కౌన్ అన్నాడు.. ఫోన్లో

తు కౌన్ అని అటునుండి ఒక లేడీ వాయిస్ వినిపించింది..

" నీ మొగున్ని" అన్నాడు గోవింద రామన్ ( హిందీలో)

" అబ్బే సాలే ఏం మాట్లాడుతున్నావ్ బే " అని అటునుండి వినిపించింది..
అర్దం కాలేదా పాపా.. నేను...  నీకు...  మొగున్ని....  అన్నాడు రామన్..
చుట్టూ ఉన్న వాళ్లు గొల్లున నవ్వుతున్నారు.

యూ.. బాస్టర్డ్ ఎక్కడుంటావో చెప్పురా ఇప్పుడే వస్తా..అని అటునుండి వినిపించింది కోపంగా..

నువ్వొచ్చేదేందె.. నీ అడ్రస్ చెప్పూ నేనే వస్తా అన్నాడు గోవిందం కూడా వీర కోపంతో (బాస్తర్డ్ అనింది కదా)

నువ్వు మగాడివే ఐతే రారా.. నా అడ్రస్ ఆ ఫోన్ ఒనర్ దగ్గరుంటుంది రాస్కో.. దమ్ముంటే  కాస్కో
అని అటునుండి సవాల్ వచ్చింది..

కోపంతో గోవిందం ఫోన్ నేలకేసి కొట్టాడు..

కొంత సేపటికి రాం కి మెలుకువ వచ్చింది..

మెలుకువ రాగానే గింజుకున్నాడు.. కానీ కాల్లు చేతులు కట్టి ఉండటం వలన చేసేదేమీ లేక తలక్రిందికి వేలాడేసి మౌనంగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు..

ఆ క్షణం రాం మనసులో ఏ ఆలోచనాలేదు.. తన చుట్టూ ఉన్న వాల్ల గురించి గాని. ఎదురుగా కూర్చునిఉన్న గోవింద రామన్ గురించి గాని.. రుక్కూ, షాన్ ల గురించి గానీ ఏ ఆలోచనాలేదు..

తన మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన..వల్లీ వల్లీ వల్లీ.. తనకు చిన్ననాటి నుండి ఈ రోజు వరకూ వల్లీ ఇచ్చిన ఙాపకాలు, రక్తం మడుగులో రోడ్డుపక్కన పడిఉన్న వల్లీ రూపం మాత్రమే.. తన మదిలో ఇప్పుడు మెదులు తున్నాయి..

రేయ్ సారుకి మెలుకువ వచ్చింది.. అని గోవింద రామన్ క్కుర్చీలొనుండి లేచి ఎదురుగా ఉన్న రాం దగ్గరకు వెల్లి..
రాం జుట్టు పట్టుకుని తల పైకి లేపి.. రాం మొహంలో మొహం పెట్టి..
ఇలా వచ్చి అలా వెల్లిపొవడానికి నా ఇల్లెమైనా నీ అత్తారిల్లనుకున్నావా. లేక గోవింద రామన్ చేతికి గాజులు వేసుకుని ఉన్నాడను కున్నావా..

చిన్న సైగ చేస్తెచాలు నిన్ను చిన్న చిన్న ముక్కలుగా నరికి చేపలకు ఎరువుగా వేస్తారు వీళ్లు.

ఉత్తుత్తి తుపాకీ తీసుకొచ్చి.. నా కుటుంబాన్ని మాయచెసి.. నా పెయింటింగ్ ఎత్తుకుపోయావ్.. 

నా గార్డ్స్ ని డబ్బుతో కొన్నావ్.. వాల్లని కూడా పట్టుకు రమ్మని నా మనుషులని పంపింఛా .. కాసేపట్లొ కుటుంబ సమేతంగా వాళ్ళుకూడా వస్తారు..

పాపం.. ఇప్పుడే చెప్పారు మాకుర్రాలు.. నీతోపాటు వచ్చిందే దాన్ని ఏసేసారంటకదా..
చాలా అదృష్ట వంతురాలు.. హాయిగా చచ్చిపోయింది..
లేదంటే మా కుర్రాళ్లు అసలె మంచోల్లు కాదు.. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకుని మురిసిపోయే రకాలు..

అని తనదైన శైలిలో చెప్పాడు గోవిందం..

రాం ఏమీ మాట్లాడ కుండా ఉన్నాడు.. సరే ఇదంతా వదిలెయ్.. నా పేయింటింగ్ ఎక్కడుందో చెప్పు. అన్నాడు గోవిందం.

నన్ను చంపేయ్..లేదా వదిలేయ్..  అన్నాడు రాం..

పేయింటింగ్ ఎక్కడుందో చెప్పు వదిలేస్తా..

మీలో ఒక్కడు కూడా ప్రానాలతో ఉండరు..

నేనేమడుగుతున్నా.. నువ్వేం చెప్తున్నావ్ అని రాంని పైకి లేపి విస్సిరేసాడు గోవిందం..

రాం అమాంతం వెల్లి పక్కనున్న డొక్కు కారు మీద పడ్డాడు..

చాలా సేపు నానా రకాలుగా చిత్ర హింసలు పెట్టాడు..
రాం వళ్లంతా రక్తమోడుతుంది..

అప్పుడే ఆ గ్యారేజీలోకి గోవిందం ఇంటి ముందు ఉండే సెక్యురిటీ గార్డ్స్ కూడా వచ్చారు..

రండి.. రండి.. మీకోసమే ఎదురు చూస్తున్నా..

నా మనుషులు మీ ఇళ్లకు వెల్లి. మీ పెళ్ళాల పీకల మీద కత్తులు పెట్టి మీ మొగుళ్లు ఎక్కడున్నా గ్యారేజీకి వెల్లమని చెప్పండి అని బెదిరించారా.. భయంతో వణుకుతూ అయ్యా మమ్మల్ని క్షమించండయ్యా అని నా నాకాళ్ళమీద పడి వెడుకుందామని వచ్చారా..

డబ్బుకు అమ్ముడుపోయి ముక్కూ మొహం తెలియని ఒక తెలుంగ్ వాన్ని నా ఇంట్లోకి అనుమతించారు.. ఇప్పుడు చూడండి వాడి గతేమటో.. మీకూఇదే గతి అని రాంని డోక్కలో కాలితో తంతూ చెప్తున్నాడు.. గోవిందం

మీ మనుషులు మా ఇళ్లకు వచ్చారు.. కత్తులు పట్టుకుని మా పెల్లాలని బెదిరించాలని చూసారు.. వాల్ల కద అక్కడ ముగించాం.. ఇప్పుడు ఇక్కడికి చచ్చింది నీకు భయపడి కాదు.. నీముందు ఉన్నాడే ఆ తెలుంగ్ కుర్రాన్ని తీసుకెలదామని వచ్చాం..

అతన్ని మాకు ఇస్తే వెళ్ళిపోతాం అన్నారు వచ్చిన నలుగురు సెక్యురిటీ గార్డ్స్..

నా పేరు చెబితే ఉచ్చ పోసుకునేవాల్లు నాముందుకే వచ్చి మాట్లాడతున్నారు.. ప్రానాలతో తిరిగేలదామనేనా అన్నాడు గోవిందం కోపంగా..

నీతో మాటలు చెప్పే తీరిక మాకు లేదు.. అతన్ని పంపిస్తే తీసుకుని వెళతాం.. లేదంటే ఇక్కడున్న వాల్లని చంపి తీసుకెలతాం అన్నారు వాల్లు..

మీరు అఫ్ట్రాల్ నలుగురు సెక్యురిటీ గార్డ్స్.. మా వాల్లు వందమంది.. ఎలా తీసుకెలతార్రా అన్నాడు గోవిందం..

మీ వాల్ల దగ్గర కత్తులు రాడ్డులు ఉన్నాయి.. మా దగ్గర పవర్ఫుల్ మిషీన్ గన్స్ ఉన్నాయి.. నాలుగు రౌండ్లు కాలిస్తే ఇక్కడ ఒక్కడు కూడా ప్రానాలతో ఉండరు అన్నారు వాల్లు..

రేయ్ వాల్ల నలుగురిని ముక్కలు ముక్కలుగా నరకండిరా అని  అరిచి చెప్పాడు గోవిందం..

ఆ మాటతో గోవిందం మనుషులు ఆ నలుగురు గార్డ్స్ మీదకు ఎగబడ్డారు..

ఆ నలుగురు గార్డ్స్ విచక్షనారహితంగా కాల్పులు జరిపారు..

గోవిందం మనుషులు కొందరు చచ్చారు.. మిగతా వాళ్లు గోవిందంని తీసుకుని పారిపోయారు..

గార్డ్స్ రాంని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లారు..

రాం గాయాలకు కట్లు కట్టారు డాక్టర్స్..

రాం పగిలిపోయిన తన మొబైల్లో నుండి తీసుకున్న సిమ్ కార్డ్ ని. కొత్త మొబైల్లో వేసి వల్లీ నంబర్ కి కాల్ చేసాడు.. నాట్ రీచబుల్ అని వస్తుంది..

మూర్తికి ఫోన్ చేసాడు..వల్లీ మొబైల్ లాస్ట్ లొకేషన్ నాకు పంపించు.. అంతే కాదు మన గార్డ్స్ ని కూడా పంపించు. అన్నాడు రాం.

పది మందిని పంపించమంటారా బాబు.. అన్నాడు మూర్తి

వెయ్యి మందిని పంపు.. మరో రెండు గంటల్లో వాల్లు నా ముందుండాలి అని కోపంగా ఫోన్ పెట్టేశాడు రాం..

పక్కన ఉన్న గార్డ్స్ ని అడిగాడు రాం.. మీరు గ్యారేజీకి ఎందుకు వచ్చారు అని.

మీరు మాకు చెక్కు ఇచ్చి వెళ్లిపోయాక.. మీరు చెప్పినట్టుగానె ఎటైనా వెళ్ళిపోదాం అని నేను మా ఇంటికి వెళ్లా. టీవీలో న్యూస్ చూసాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్టుకి వెళ్లేదారిలో.. ఆగి ఉన్న కారులో ఉన్న టూరిస్టు జంటను టార్గెట్ చేసి.. అమ్మాయిని చంపేసి, అబ్బాయిని తీసుకెల్లిపోయారని వార్తల్లో చూసాం.. ఆ వార్తల్లో చూపించిన కారు మీరు గోవింద రామన్ ఇంటికి వేసుకునిచచ్చిన కారే అవడం చేత.. గోవింద రామనే ఈ పని చేయించి ఉంటాడని నాకు అనుమానం వచ్చింది. కరెక్టుగా అప్పుడే మా ఇంటికి గోవింద రామన్ మనుషులు ఇద్దరు వచ్చారు.వాల్లని చితక బాదితే  వాళ్లు చెప్పారు. మిమ్మల్ని గ్యారేజీకి తీసుకొచ్చారని.. అందుకే వచ్చాం అని వివరంగా చెప్పారు గార్డ్స్..

నాతోపాటు వచ్చిందే ఆమె గురించి ఎమైనా చెప్పారా న్యూస్లో అని అడిగాడు రాం..

లేదు మేము పూర్తిగా చూళ్ళేదు..అన్నారు వాల్లు.

మీకు చాలా థాంక్స్.. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను.. కానీ నీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు.. వీలైనంత త్వరగా మీ ఫామిలీతో ఎటైనా వెళ్లండి అన్నాడు రాం..

మిమ్మల్ని ఇలా వదిలేసి.. ఎలా అన్నారు వాల్లు

నాకేం పరవాలేదు.. మీరు వెళ్లండి అని చెప్పడంతో వాళ్లు వెళ్లిపోయారు..

వాళ్లు వెళుతుంటే.  ఒక్క నిమిషం అని ఆపి తలా ఒక కోటి చెక్కు ఇచ్చి పంపించాడు..

వళ్లుహునం అయినట్లుంది.. హాస్పిటల్ బెడ్డుపై నడుం వాల్చాడు రాం..
కల్లు మూసుకుంటే వల్లియే గుర్తొస్తుంది..
రాం మనసులోనే..వల్లీని కేరలా తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేసా.. నేను ఫులీష్గా ఉన్నా వల్లీ విషయంలో.. గోవిందం లాంటి వాడితో మాట్లాడటానికి వచ్చేటప్పుడు కనీసం సెక్యురిటీ చూసుకోకుండా వచ్చా.. కేవలం నా వల్లే వల్లికి ఇలా జరిగింది అని రాం తనని తాను నిందించుకుంటున్నాడు.. డాక్టర్ వచ్చి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ చేస్తున్నాడు..

పక్క నున్న టీవీలో..

మద్యాహ్నం రోడ్డుపక్కన జరిగిన హత్యకేసులో మృతురాలి వివరాలేవీ తెలిసిరాలేదు.. మృతురాలి బందువులుకూడా ఇంకా ఎవరూ రానందున ఆమె శవాన్ని మార్చురీకి తరలించామని డాక్టర్ జోసెఫ్ చెప్పారు.. ఇప్పుడు డాక్టర్ మాటల్లోనే విందాం..

డాక్టర్ గారు చెప్పండి:

ఆమెను మా సిబ్బంది అంబులెన్సులో మా హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె బాగా గాయపడి మృతి చెంది ఉంది.. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఇక్కడే ఉంఛాము. పోలీసు క్లియరెన్స్ వచ్చాక.. బాడీకి పొస్టుమార్టం నిర్వహిస్తాము. అప్పటివరకు బాడీని మార్చురీలొ ఉంచుతాము అని డాక్టర్ వివరించారు..

ఈ విదంగా రాం ఉన్న హాస్పిటల్ గదిలోని టీవీలో న్యూస్ వస్తుంది.. కానీ న్యూస్ మలయాళంలో ఉండటం వలన.. రాం ఆ న్యూస్ వినిపించుకోలేదు.. ఈలోగా డాక్టర్ రాంకి పెయిన్ కిల్లర్స్  ఇచ్చి వెల్లొపోయాడు..

డాక్టర్ వెళ్లిపోయిన పదినిమిషాలకి అక్కడికి ఒక పోలీస్ వచ్చాడు..

☆☆☆☆☆

సమయం రాత్రి ఏడు దాటుతుంది..

ఎవరే ఇందాక ఫోన్లో అంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నావ్ అనింది రుక్కూ..

ఎవడో గొట్టంగాడు.. నీ నంబర్ నుండి చేస్తె లిఫ్ట్ చేయడం లేదని రాం అన్నయ్యకి నా నంబర్ నుండి చేసా.. ఎవడో లిఫ్ట్ చేసాడు ఎవరు అంటే నీ మొగున్ని అన్నాడు.. గు___లో మండింది. దమ్ముంటే రారా అని చెప్పా.. అనింది మదు

ఐనా రాం ఫోన్ వాడి దగ్గర ఎందుకు ఉందో. అసలు వాడెవడో. అంత అవసరమా నీకు అనింది రుక్కూ..

వాడి మొహం వాడికి అంత సీన్ లేదు.. ఇలా హై పిచ్చిలో మాట్లాడే వాల్లు.. రియల్ పిచ్చిలోకి దిగితే ఫసక్కె.. నిమిషం కూడా నిలబడలేరు.. అనింది మదు.

ఏంటోనే.. నువ్వు సింగిల్ మీనింగులో మాట్లాడినా.. నాకు డబుల్ మీనింగు లాగే వినిపిస్తుంది అనింది రుక్కూ..

నేను మాట్లాడింది డబుల్ మీనింగే అనింది మదు..

నిన్ను మార్చడం ఎవడి వల్లాకాదే బాబు.. అని ఊరుకుంది రుక్కూ..

నీ మొబైల్ ఇలా ఇవ్వు ఈసారి నేను మాట్లాడతా అని.. మదు మొబైల్ తీసుకుని డయల్ చేసింది రుక్కు..

ఈసారి రాం లిఫ్ట్ చేసాడు.. ఎంటి సార్ మద్యాహ్నం నుండి ట్రై చేస్తున్నా తమరి ఫోన్కి.. కొన్ని సార్లు కలవదు.. కలిసినప్పుడు మీరు లిఫ్ట్ చేయరు.. ఇప్పుడు కూడా కొత్త నంబర్ నుండి చేసా కాబట్టి లిఫ్ట్ చెసినట్టున్నావ్.. అప్పుడే బోరు కొట్టేసానా.. అనింది రుక్కూ అవతలి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా..

నేను కొంచెం బిజీగా ఉన్న.. తరువాత మాట్లాడతా అని రాం ఫోన్ పెట్టేశాడు..

అంతేలే.. బోరుకొట్టాక మాకన్నా బిజీ పనులే ఉంటాయి మీకు అనింది రుక్కు.. కానీ అటునుండి సమాదానం రాకపొయే సరికి.. అప్పటికే అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసాడని తెలుసుకుని.. హుమ్..హుమ్.. అని పెదవి విరిచింది రుక్కూ..

☆☆☆☆☆

మూడేల్ల క్రితం జరిగిన కథ

అర్లీ మార్నింగ్.. రాజన్ లుంగీ కట్టుకుని ఇంటి ముందు మొక్కలకు నీల్లు పోస్తున్నాడు మేరీ ఇంట్లో.

మేరె షార్టు, టీ షర్టు వేసుకుని.. టెర్రస్ మీద నుండి క్రిందికి వంగి.. రాజ్.. అని పిలించింది మొక్కలకు నీల్లు పోస్తున్న రాజన్ని.

కానీ రాజన్ కి వినిపించలేదు..

మేరీ తన హెయిర్ బాండ్ తీసీ.. రాజన్ మీద పడేసింది..

ఏంటా అని రాజన్ పైకి చూసాడు.. పైకి రా..పైకి రా అని సైగ చేస్తూ మేరీ కనిపించింది మేడమీద

మొక్కలకు నీల్లు పోయాడం ఆపి రాజన్ మెడ మీదకు వెళ్లాడు..

రాజన్..  చిన్న హెల్ప్ చెయ్యరా అనింది మేరీ..

" రా " అన్నందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా సరే చెప్పండి ఏం సాయం చెయ్యాలి అన్నాడు రాజన్..

విరిగిపోయి వాడకుండా మేడ మీద పక్కన పడేసిన పాత కుర్చీలో కూర్చుని.. రాజన్ చేతిలో గోద్రేజ్ పాకెట్ పెట్టి కొంచెం నా హెయిర్ కి కలర్ వేయరా అని రొమాంటిక్ గా అడిగింది మేరీ..

రెండు క్షణాలు ఆలోచించి హెయిర్ కలర్ వేయడం మొదలు పెట్టాడు రాజన్..

అవును నాకు చిన్న సందేహం.. మగవాళ్ళకి జుట్టు చిన్నగా ఉంటుంది. ఈజీగా కలర్ వేసుకుంటారు.. కానీ ఆడవాళ్ళకి జుట్టు పొడవుగా ఉంటుంది ఎలా వేసుకుంటారు.. పైగా మీ జుట్టు చాలా పొడవుంది కష్టం కదా..అన్నాడు రాజన్

అందుకేగా..నీ హెల్ప్ అడిగా అనింది మేరీ..

ఇప్పుడంటే నేను ఉన్నా.. కానీ నేను లేనప్పుడు ఎలా వేసుకునే వారు అన్నాడు రాజన్..

నాతోరా అని రాజన్ చేయి పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి టీషర్టు విప్పి జుట్టు ముందుకు వేసుకుని ఇలా వేసుకుంటా అనింది..

రాలిపోవడానికి సిద్దంగాఉండి.. బాగా మాగిన బంగినిపల్లి మామిడి పండులా మృదువుగా.. టైం దాటిపోయి కరిగిపోతున్న ఐస్ క్రీం లా.. వాడిపోతున్న గులాబీలా.. తన ముందు నిలుచుని ఉన్న మేరీని.. రాజన్ అలాగే గుడ్లప్పగించి చూస్తున్నాడు..

ఏంటి అలా చూస్తున్నావ్ అనింది మేరీ..

రాజన్ అమాంతం మేరీని గట్టిగా కౌగిలించుకున్నాడు..

షవర్ నుండి జాలువారే నీల్లు మెల్లగా వాళ్లిద్దరి శరీరాల మీద పడుతున్నాయి..

ఆ క్షణం వారి శరీరాలమీద రేగే సన్నని ఆవిర్లు.. వారి వంటి మీద పడే వేడి నీటి వలనో లేదా ఇన్నేళ్ళూ ఆమె దేహం అనుబవిస్తున్న విరహపు దాహం వలనో ఆ నీటికే తెలియాలి..

మనసుకి కోరిక కలిగితే అనుభవాలు నెమరు వేసుకోగలదు.. కానీ శరీరం అలా కాదు.. దానికి కోరిక కలిగితే అను "భూతులు" కావాలి.. అనింది మేరీ..

రాజన్ మేరీని అమాంతం వడిలోకి ఎత్తుకుని.. నాకు అలాంటి అను"భూతులు" కొన్ని నేర్పించవా అన్నాడు..

నేర్పిస్తాకానీ గురు దక్షినగా ఎమిస్తావ్ అనింది మేరీ..

ఏం కావాలి అన్నాడు రాజన్..

ప్రతి రోజూ బోలడన్ని ఙాపకాలు.. నా మనసు కోరుకునే ఙాపకాలు.. ఈ శరీరానికి ఇవ్వు.. అనింది మేరీ..

ఐతే వాత్సాయనుడు రాసిన బుక్ డౌన్లోడ్ చెయ్యాలన్నమాట అన్నాడు రాజన్..

నువ్వు బుక్కు డౌన్లోడ్ చేస్తావో లేక కొత్త బుక్కే రాస్తావో నాకు తెలియదు.. ఈ క్షణం నుండి ఒక్క క్షణం కూడా వృదా అవడానికి వీల్లేదు అనింది మేరీ..

☆☆☆☆☆

హాయ్ సార్ నాపేరు మీర్ ఖాసిం సర్కిల్ ఇన్స్పెక్టర్.. మూర్తిగారు నాకు ఫోన్ చేసారు.. మీరేదో సమస్యలో ఉన్నట్టు ఆయనకు అనిపించిందట.. మీ పక్కనుండమని నన్ను పంపారు.. మీ ప్రజంట్ లొకేషన్ హాస్పిటల్ చూయించింది.. అందుకే వెంటనే వచ్చా.. మీకు ఈ దెబ్బలు ఏలా తగిలాయి సర్ అన్నాడు ఖాసిం..

మీరు నన్ను సార్ అనక్కర్లేదు.. నాపేరు రాం.. రాం అనొచ్చు. ఇకపోతే నేనూ నా ఫ్రెండ్ ఎయిర్పోర్ట్  కి వెళుతుంటే ఎవరో మా మీద ఎటాక్ చేసారు.. నా ఫ్రెండ్ ని కత్తితో పొడిచి నన్ను కొట్టి వేరేచోట పడెసారు.. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి అన్నాడు రాం..

ఇప్పుడే మీ ఫ్రెండ్ గురించిన ఇన్ఫరమేషన్ తెలుసుకుంటా అని
ఖాసిం కంట్రోల్ రూంకి ఫోన్ చేసి.. కంట్రోల్ రూంవాల్లకి మొత్తం విషయం చెప్పాడు ఖాసిం..

పావుగంట తరువాత ఖాసిం కి ఫోన్ వచ్చింది.. ఖాసిం ఫోన్ మాట్లాడి పెట్టేసి..

రాం.. మీరు చెప్పిన ఆమె చనిపోయిందట దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో  ఆమె బాడీ ఉందట.. మా కానిస్టెబుల్ చెప్పాడు.. మీకు కుదిరితే  ఆ హాస్పిటల్ కి వెళదాం నాతో రండి అన్నాడు.. ఖాసిం..

రాం మూర్తికి ఫోన్ చేసి.. మూర్తి ఇంకా ఎంతసేపు అన్నాడు కోపంగా..

ఈ పాటికే మీ దగ్గరకు వచ్చేసుండాలి బాబు.. ఒకసారి హాస్పిటల్ ముందు చూడండి అన్నాడు మూర్తి..

రాం హాస్పిటల్లో నుండి బయటికి వెల్లి చూసాడు.. దాదాపుగా వెయ్యిమంది పైనే ఉన్నారు.. అందరూ జవానుల్లా ఉన్నారు చూడ్డానికి..

ఖాసిం వారిని చూసి..ఎవరు రాం వీళ్ళంతా అన్నాడు..

నా ప్రైవేటు సైన్యం..అన్నాడు రాం

మీరు సమస్యల్లో ఉన్నారంటే.. ఏదో చిన్న సమస్య అనుకున్నా.. కానీ ఇది చిన్న సమస్యలా లేదు.. అసలు ఏం జరిగిందో చెప్పు రాం అన్నాడు ఖాసిం..

గోవింద రామన్.. నాకు గోవింద రామన్ కావాలి వాన్ని నేను చంపాలి.. అన్నాడు రాం..

ఎంటి రాం నువ్వనేది.. గోవింద రామన్ని చంపాలా !.

వాడెమైనా చిన్న వీది రౌడీ అనుకుంటున్నావా.. రక్తం త్రాగే రాక్షసుడు.. వాడి పేరు చెప్తేనే మా డిపార్టుమెంట్లో చాలామందికి భయంతో తడిసిపోద్ది..  పెద్ద పెద్ద తలలే వాడికోసం పని చేస్తుంటాయి మా డిపార్టుమెంట్లో.. ఎంతమంది రాజకీయ నాయకులు వాడి వెనుక ఉన్నారో నీకు తెలుసా.. అసలు వాడి బ్యాగ్రౌండ్ నీకు తెలుసా.. వాన్ని ఎదిరిస్తె కుటుంబం కుటుంబాన్ని నిర్దాక్షిన్యంగా తగలెట్టేస్తాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే వాడికి ఎదురెల్లడమంటె మృత్యువుకి ఎదురెల్లినట్టే.. ఈ రాష్ట్రానికే వాడు వేయితలల రావణాసురుడు అన్నాడు ఖాసిం..

ఖాసిం సార్.. మీ పరామర్సకు థాంక్స్.. ఈ సమస్యను నేను చుసుకో గలను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. నా ఫ్రెండ్ బాడీ ఏదో హాస్పిటల్లో ఉందన్నారుగా ఆ హాస్పిటల్ అడ్రస్ ఇస్తే.. నాకు చాలా పనుంది ఈ రాత్రి.. అన్నాడు రాం..

ఖాసిం.. ఆ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి.. వెళ్లిపోతూంటే.

ఖాసిం సాబ్ ఒక్క క్షణం.. అనగానే ఖాసిం ఆగి వెనక్కి చూసాడు..

సాబ్.. రేపు ఒక కొత్త సూర్యోదయాన్ని మీ రాష్ట్రానికి  చూపిస్తా. మీ డిపార్టుమెంటుకున్న భయాన్ని పోగొడతా

ఈ రాత్రి.. ఎంత మంది అడ్డొచ్చినా ఆ వేయితలల రావనున్ని.. తెళ్లారేలోగా తెగనరుకుతాడీరాముడు.. వెల్లి మీ డిపార్టుమెంట్టుతో చెప్పండి.. భయమంటే తెలియని ఒకడు తెలుగునాట నుండి వచ్చాడని..

గుర్తుపెట్టుకో సాబ్. రెక్కలు నరకగానే క్రింద పడటానికి జటాయువు కాదువీడు.. రాముడు

వెల్లి ఆ పిరికి పందకు చెప్పు అన్నాడు రాం..

ఇక తన ఎదురుగా ఉన్న ప్రైవేటు సైన్యం వైపు తిరిగి.. మీరు సిద్దంగా ఉన్నారా బోయ్స్ అన్నాడు రాం..

యస్సార్ అన్నారు అందరూ.. గట్టిగా
వారిలోనుండి ఒకడు ముందుకు వచ్చి. సార్ మొత్తం కేరలాని జల్లెడవేసైనాసరే మేము వాన్ని పట్టుకుంటాం సార్.. వాడి రక్తంతో వల్లీ మెడమ్ కి తర్పనం చేస్తాం.. అన్నాడు వాడు..

అలా రాం తన సైన్యంతో ముందుకు కదిలాడు

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro